తొడ చూస్తే చొంగకార్చి వెర్రెక్కిపోతా, నా ఇష్టం.. మరో పాటతో ఆర్జీవికి షాక్ ఇచ్చిన పరాన్నజీవి!

0
45

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా సంచాలనమే. ఆయనపై సెటైర్స్ వేయాలన్నా కూడా కష్టమే. అయితే పరాన్న జీవి టెక్నీషియన్స్ మాత్రం ఊహించని విధంగా కౌంటర్ ఇస్తున్నారు. వర్మ చేసిన దానికంటే హై రేంజ్ లోనే రచ్చ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా వర్మ నా ఇష్టం అనే కాన్సెప్ట్ పై పరాన్నజీవి నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ లో వర్మకు ఇష్టం ఉన్నట్లుగా కౌంటర్ ఇచ్చారు.

పవర్ స్టార్ VS పరాన్న జీవి
గతంలో ఎప్పుడు లేని విధంగా టాలీవుడ్ లో ఒక రెండు సినిమాలు పోటాపోటీగా వార్ చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు కక్ష తీర్చుకునేలా ఉన్న ఈ ఫైట్ లో ఎవరు హైలెట్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే పవర్ స్టార్ VS పరాన్న జీవి కి సంబంధించిన ట్రైలర్స్, సాంగ్స్, పోస్టర్స్ సోషల్ మీడియాలో పోటాపోటీగా వైరల్ అవుతున్నాయి.

అంతా నా ఇష్టం..
ఇక లేటెస్ట్ గా పరాన్న జీవి నుంచి విడుదలైన రెండవ సాంగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్మ నా ఇష్టం అంటూ అప్పట్లో ఒక బుక్ రాసిన విషయం తెలిసిందే. ఇక అదే పేరుతో సాంగ్ లో పరాన్నజీవి టీమ్ ఇష్టం ఉన్నట్లుగా వర్మను ఆడేసుకున్నట్లు అర్ధమవుతోంది.

ట్విట్టర్ నుంచి వోడ్కా వరకు
బేసిక్ గా అంతా నా ఇష్టం అంటూ మొదలయ్యే ఈ పాటలో వర్మ ట్విట్టర్ నుంచి వోడ్కా, అమ్మాయి తొడ అంటూ అన్ని కాంట్రవర్సీలను కలిపేశారు. తిక్కతిక్కగా ఏం చేసినా ఆడిగేదెవడురా నా ఇష్టం అంటూ వర్మ మార్క్ ని తలిపించే లైన్స్ ని యాడ్ చేశారు. ఇక బెడ్ రూమ్ లోకి వచ్చి బాగోతం చూస్తా అనే లైన్స్ కూడా ఘాటుగా ఉన్నాయి.

ఏది క్లిక్కవుతుందో..
వర్మ ఏం చేస్తాడు ఎలా ఉంటాడు అనే విషయాలన్నీ అందరికి తెలిసినప్పటికీ ఈ సాంగ్ తో కౌంటర్ ఇవ్వడంలో పరాన్నజీవి సక్సెస్ అయినట్లే తెలుస్తోంది. షకలక శంకర్ లాంటి కమెడియన్ వర్మ పాత్రలో కనిపిస్తుండడంతో ఈ సినిమాపై జనాల్లో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే కలుగుతోంది. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి అయితే పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోంది. మరి రెండు సినిమాల్లో ఏది ఎక్కువగా క్లిక్కవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here