తెలుగులో ప్లాప్ అయిన స్టోరీ.. హిందీలో హిట్ అవుతుందా..?

0
26

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోని డిజాస్టర్ సినిమాలలో ”అజ్ఞాతవాసి” ఒకటి. పవన్ సిల్వర్ జూబ్లీ మూవీగా భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం తీవ్ర నిరాశను నష్టాలని మిగిల్చింది. 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాతలకు 50 కోట్లకు పైగా నష్టాలను తెచ్చిపెట్టింది. త్రివిక్రమ్ – పవన్ లకు వారి అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని చేదు జ్ఞాపకంగా ‘అజ్ఞాతవాసి’ మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఈ స్టోరీని హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

‘లార్గో వించ్’ అనే ఫ్రెంచ్ మూవీని కాపీ చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని తీసాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. లార్గో వించ్ దర్శకుడు జెరోమ్ సల్లే సైతం ‘అజ్ఞాతవాసి’ తన సినిమాకు కాపీ అని ట్వీట్ చేసాడు. ఆ సమయంలో ఈ సినిమా ప్లాప్ అయిన దానికంటే అది కాపీ అనే వార్తలు ఫ్యాన్స్ ఎక్కువ బాధించాయి. ఇక ప్రభాస్ – యువ దర్శకుడు సుజీత్ కాంబోలో వచ్చిన ‘సాహో’ సినిమా సైతం ‘లార్గో వించ్’ ని పోలి ఉందనే కామెంట్స్ వచ్చాయి. ఇలా రెండుసార్లు తెలుగు ప్రేక్షకులు రిజెక్ట్ చేసిన ఈ స్టోరీ లైన్ ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్తోంది.

‘లార్గో వించ్’ అఫీషియల్ రీమేక్ రైట్స్ తీసుకుని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి నీరజ్ పాండే ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘శక్తి’ ‘ఊసరవెల్లి’ ‘తుపాకీ’ ‘సికిందర్’ చిత్రాలలో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ ఈ ప్రాజెక్ట్ లో హీరోగా నటిస్తున్నారు. ‘రుస్తుం’ ఫేమ్ టిను సురేష్ దేశాయ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తెలుగులో ప్లాప్ అయిన స్టోరీ ఏ మేరకు హిందీ ఆడియన్స్ హిట్ చేస్తారో అనేది ప్రశ్నార్థకంగా మారింది. అందులోను ‘సాహో’ సినిమాని బాలీవుడ్ ప్రేక్షకులు ఆల్రెడీ చూసేశారు. ఎన్ని మార్పులు చేర్పులు చేసినా ఈ కథ బాలీవుడ్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలని తెలుగు ఆడియన్స్ డిస్కష్ చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here