తెలంగాణ యూనివర్సిటీలో పాఠం… అది కదా పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే?

0
11

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన అనతి కాలంలోనే తన కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు.. తాజాగా ఆయన గురించి, ఆయన పార్టీ తెలంగాణ యూనివర్సిటీలో ఒక పాఠమే ప్రవేశపెట్టారు అంటే ఆయన క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..

చిరంజీవి నట వారసుడిగా

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో తెరంగేట్రం చేశారు.. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు ఇలా వరుస సినిమాలు చేస్తూ ఖుషి సినిమాతో సూపర్ హిట్ కొట్టడమే కాక తెలుగులో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ఏర్పరుచుకున్నాడు.

యువరాజ్యం అధ్యక్షుడిగా

అయితే చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయన క్రేజ్ మాత్రం అనితర సాధ్యం అని చెప్పాలి.. ఖుషి తరువాత గుడుంబా శంకర్, జానీ, శంకర్ దాదా ఎం బి బి ఎస్, బాలు, బంగారం, అన్నవరం, శంకర్దాదా జిందాబాద్, జల్సా లాంటి సినిమాలతో అలరించారు. అయితే 2009లో తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టగా అందులో యువరాజ్యం అనే విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పార్టీని గెలిపించే ప్రయత్నం చేశారు.

జనసేనాధిపతిగా

అయితే అనూహ్యంగా పార్టీ గెలవకపోవడంతో మళ్ళీ సినిమాలు చేయడం మొదలు పెట్టిన ఆయన పులి, తీన్మార్, పంజా, గబ్బర్సింగ్, సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అత్తారింటికి దారేది సూపర్ హిట్ కొట్టిన తర్వాత రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన ఆయన జనసేన పార్టీని స్థాపించారు.

2019లో వర్కౌట్ కాలేదు

అయితే అప్పటికే రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన అప్పటికీ ఉన్న బిజెపి తెలుగుదేశం కూటమికి మద్దతు పలికారు. అయితే ఆ తర్వాత 2019 ఎన్నికలకు విడిపోయి సొంతంగా పోటీ చేసినా కేవలం ఒక్క సీటు మాత్రమే పరిమితం అయింది..

యూనివర్సిటీ పాఠాలలో

అయితే అనూహ్యంగా జనసేన గురించి తెలంగాణలోని ఒక యూనివర్సిటీ పాఠాలలో ప్రస్తావించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని చూసిన పవన్ ఫ్యాన్స్ దాన్ని సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ 4వ సెమిస్టర్ పొలిటికల్ సైన్స్ బుక్ లో జనసేన పార్టీ గురించి పార్టీ ప్రత్యేకత గురించి ఒక సారాంశం ఉందని చెబుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షేర్లు చేస్తున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here