తారక్ కు ఏదీ అనుకూలిస్తున్నట్లు లేదు..!

0
23

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగుతో పాటుగా పలు ఇతర భారతీయ భాషల్లో రూపొందతున్న ఈ సినిమాతో తారక్ మార్కెట్ పాన్ ఇండియా స్థాయిలో విస్తరించనుంది. ఇదే క్రమంలో ‘జనతా గ్యారేజ్’ దర్శకుడు కొరటాల శివతో పాన్ ఇండియా మూవీ ‘#NTR30’ చేయనున్నాడు. మధ్యలో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఇలా కెరీర్ ని పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటున్న ఎన్టీఆర్ కు పరిస్థితులు మాత్రం అనుకూలించడం లేదని అర్థం అవుతోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని ముందుగా దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. మే నెలలో ఈ మూవీ షూటింగ్ అయిపోతే జూన్ లో కొరటాల శివ సినిమా స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అలానే ప్యారలల్ గా ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎన్టీఆర్ ప్లాన్ ని అడ్డంకులు ఏర్పడ్డాయి. ట్రిపుల్ ఆర్ షూట్ ఇప్పటికే నిలిచిపోగా.. మహమ్మారి వైరస్ కారణంగా ‘ఎవరు మీలో..’ షో కోసం కంటెస్టెంట్స్ ని తీసుకురాడానికి ఛానెల్ వారు చాలా కష్టపడాల్సి వస్తోందట. దీంతో ప్రస్తుతానికి ఈ షో వాయిదా వేయాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది.

నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారు. మరి కొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్తుందని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయి కొరటాల లైన్ లోకి వచ్చాడు. అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది.. ‘#NTR30’ స్టార్ట్ చేస్తారు అనేది చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రస్తుతం తారక్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరి త్వరలోనే పరిస్థితులు చక్కబడి తారక్ ప్లాన్స్ అన్నీ సజావుగా సాగుతాయేమో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here