తన ఫస్ట్ లవర్ ఫోటో షేర్ చేసిన వర్మ..!

0
20

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. కమిట్మెంట్ లేని బంధాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. పెళ్లి – ఫ్యామిలీ అంటే వర్మకు అస్సలు గిట్టవు. అందుకే ప్రేమ అంటే ఆనందమని.. పెళ్లి అనేది తలనొప్పి అని.. విడాకులు అంటే స్వర్గమని.. అన్ని వివాహాలు నరకంలో జరుగుతాయని ఆర్జీవీ చెబుతుంటారు. అతిలోకసుందరి శ్రీదేవి తన క్రష్ అని అనేక సందర్భాల్లో చెప్పిన వర్మ.. ఈరోజు సోషల్ మీడియా వేదికగా తన కాలేజీ డేస్ లో తన ఫస్ట్ లవ్ విషయాన్ని వెల్లడించారు.

విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో రాంగోపాల్ వర్మ బిటెక్ చదువుతున్నప్పుడు.. అదే కాలేజీలో మెడిసిన్ చేసే పోలవరపు సత్య అనే అమ్మాయిని ప్రేమించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా స్విమ్ సూట్ లో ఉన్న తన ఫస్ట్ లవ్ ఫోటోలను షేర్ చేస్తూ.. తొలిప్రేమ గురించి అందరికీ తెలియజేసారు. ”ఈ ఫొటోలో నీలిరంగు స్విమ్ సూట్ ధరించిన మహిళ సత్య. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న రోజుల్లో నా ఫస్ట్ లవ్. సత్య ప్రస్తుతం అమెరికాలో మెటర్నల్ ఫెటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ మరియు ఓబి జిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు” అని ఆర్జీవీ తెలిపారు.

”ఆ రోజుల్లో మెడికల్ కాలేజీ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ రెండూ కొన్ని లాజిస్టికల్ కారణాల వల్ల ఒకే కాంపౌండ్ లో ఉండేవి. అక్కడే సత్యతో వన్ సైడ్ లవ్ పుట్టింది. అయితే ఆమె డబ్బున్న మరో వ్యక్తితో ప్రేమలో ఉన్న కారణంగా నన్ను పట్టించుకోలేదని నేను భావించాను. అలా నేను ‘రంగీలా’ కథ రాశాను” అని రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. ”నా ల్యాండ్ మార్క్ చిత్రం ‘సత్య’ మరియు ‘క్షణ క్షణం’ చిత్రంలో శ్రీదేవి పాత్రలకు సత్య పేరు పెట్టాను” అని తెలిపారు. ఈ ఫోటోలు మయామి బీచ్ నుండి సత్య తనకు పంపించిందని ఆర్జీవీ పేర్కొన్నారు.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ఫస్ట్ లవ్ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిత్యం ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ఆర్జీవీ.. ఇలా తన తొలిప్రేమను పరిచయం చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here