తన పేరిట ‘ఓటిటి’ ప్రారంభించనున్న సౌత్ హీరోయిన్..!

0
24

చిత్రపరిశ్రమలో ప్రస్తుతం ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటివరకు థియేటర్స్ మాత్రమే మంచి అనుభూతిని కలిగిస్తాయి.. ఎంచక్కా ఫ్యామిలీతో అలా థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు.. అనే ఆలోచనలకి కరోనా బ్రేక్ వేసేసింది. దాదాపు ఏడాది కాలంగా తెరకెక్కుతున్న చిన్న – మీడియం బడ్జెట్ సినిమాలకు ఓటిటిలే దిక్కు అయిపోయాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. ఇప్పట్లో సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యేలా లేవు. అలాగే సినిమా షూటింగ్స్ నిలిచిపోయి మేకర్స్ కూడా ఎవరిళ్లకు వారే అంకితం అయిపోయారు. ఇలాంటి తరుణంలో ప్రేక్షకులకు సామాన్య జనాలకు వినోదం పంచాలంటే కేవలం ఓటిటిలే అందుబాటులో ఉన్నాయి.

నిజానికి కరోనా వచ్చినప్పటి నుండి ఓటిటిలకు ప్రాధాన్యత పెరిగిపోయింది. జనాలు కూడా లాక్డౌన్ సమయంలో పూర్తిగా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. అందుకే ఇప్పుడు థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేసినా కరోనా భయంతో వచ్చే సూచనలు కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓటిటిలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు డిమాండ్ పెరగడంతో కొత్తగా ఓటిటిలు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా సౌత్ హీరోయిన్ నమిత కూడా ‘నమిత టాకీస్’ అనే పేరుతో ఓటిటి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్బంగా నమిత మాట్లాడుతూ.. ‘మా ఓటిటి ద్వారా చిన్న – మీడియం బడ్జెట్ సినిమాలకు రిలీజ్ చేసుకునే అవకాశం ఇవ్వనున్నాం.

కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న దర్శకులు – నటులకు ఇది మంచి ప్లాట్ ఫామ్. ఖచ్చితంగా నూతన టాలెంట్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఓటిటిని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఎప్పుడు స్ట్రీమింగ్ స్టార్ట్ చేస్తారనేది చెప్పలేదు. కానీ త్వరలోనే ఫస్ట్ రిలీజ్ ప్రకటిస్తామని” ఆమె చెప్పింది. అయితే ఈ ఓటిటిని రవివర్మ అనే సాఫ్ట్ వేర్ ఫ్రెండ్ భాగస్వామ్యంతో రన్ చేయనున్నట్లు చెప్పుకొచ్చింది నమిత. ఇదిలా ఉండగా.. నమిత చివరిగా పొట్టు అనే సినిమాలో మెరిసింది. ప్రస్తుతం బౌబౌ అనే సినిమా చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here