తండ్రి కొడుకులతో రొమాన్స్ లో రేర్ ఫీట్!

0
32

అతిలోక సుందరి శ్రీదేవి ఏఎన్నాఆర్ సరసన నాయికగా నటించారు. ఆ తర్వాత యువసామ్రాట్ అక్కినేని నాగార్జున సినిమాలోనూ నాయికగా నటించి సర్ ప్రైజ్ చేశారు. తండ్రి కొడుకులతో అవకాశం అందుకున్న ఏకైక నాయికగా..శ్రీదేవి కెరీర్ లో ఇది అరుదైన ఫీట్. ఇలాంటి అవకాశం వేరొక కథానాయికకు రానేరాదు అంటూ అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. మరి అలాంటి అవకాశం నేటితరం నాయికలకు రాదా? అంటే.. ఎందుకు రాలేదు..

ప్రస్తుత జనరేషన్ లో ఐదుగురు భామలు ఈ తరహాలో తండ్రి కొడుకులతో నటించే అవకాశం దక్కించుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్  రామ్చరణ్ తో పాటు చిరంజీవి సరసనా నటించారు. మగధీర- నాయక్- గోవిందుడు అందరివాడేలే చిత్రాల్లో చరణ్ సరసన నటించిన కాజల్ మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీనంబర్ 150లో నటించారు. అమ్మడు కుమ్ముడూ అంటూ కాజల్ తో బాస్ రొమాన్స్ ని అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. కాజల్ కేవలం మెగా కాంపౌండ్ లోనే కాదు.. ఇటు అక్కినేని కాంపౌండ్ లోనూ తండ్రి కొడుకులతో నటించిన ఘనతను సొంతం చేసుకున్నారు.  నాగచైతన్య సరసన దడ చిత్రంలో నటించిన కాజల్ నాగార్జున సరసన తదుపరి చిత్రంలో నటించనున్నారని తెలుస్తోంది.

మెగా కాంపౌండ్ లో తండ్రి కొడుకులతో నటించిన ఘనత మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కు కూడా దక్కింది. తమన్నా- చరణ్ సరసన రచ్చ చిత్రంలో నటించారు. తర్వాత సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి సరసన నాయికగా కనిపించారు.

కాజల్ తరహాలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా అక్కినేని కాంపౌండ్ లో నటించారు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నాగచైతన్య తో రొమాన్స్ చేసిన రకుల్ ప్రీత్ ఆ తర్వాత మన్మథుడు2లో నాగార్జున తోనూ రొమాన్స్ చేశారు. అలాగే అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి- నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా.. చైతన్య యుద్ధం శరణం చిత్రాల్లో నటించారు.

రెండు జనరేషన్లలో తండ్రి కొడుకులతో నటించే అవకాశం చాలా అరుదుగా కొందరికే దక్కేది. అలాంటి అరుదైన అవకాశం ఆ ఐదుగురు భామలకు దక్కగా కాజల్ ఏకంగా రెండు పెద్ద ఫ్యామిలీల్లో తండ్రి కొడుకులతో నటించేయడం రేర్ రికార్డ్ అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here