‘ఢిల్లీ కోవిడ్ సెంటర్’కు అమితాబ్ భారీ విరాళం..!

0
17

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ స్వేచ్ఛగా ఊపిరి తీసుకోకుండా చేస్తోంది. ఓవైపు రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండగా మరోవైపు వేలసంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి దారుణ పరిస్థితిలో సినీసెలబ్రిటీలు – వ్యాపారవేత్తలు – పాపులారిటీ కలిగిన పర్సనాలిటీలు కరోనా హెల్పింగ్ సెంటర్లకు విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఢిల్లీ గురుద్వారా కోవిడ్ కేర్ సెంటర్ కు ఆయన 2కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ సందర్బంగా ఢిల్లీ రాకజ్ గంజ్ లో కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్న మజిందర్ సింగ్ సిర్సా అమితాబ్ బచ్చన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కోవిడ్ సెంటర్ సేవలు నేటి నుండే ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా మజిందర్ సింగ్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రాంతంలో కోవిడ్ విలయతాండవం చేస్తున్నప్పుడు అమితాబ్ గారు ఫోన్  చేసి 2కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

సరైన సమయంలో ఆయన నుండి సహకారం అందింది. అలాగే బాధితులకు ఆక్సిజన్ కొరత లేకుండా విదేశాల నుండి తెప్పించేందుకు అమితాబ్ గారి ఇచ్చిన విరాళం తోడ్పడుతుంది. రాకజ్ గంజ్ గురుద్వారాలో 300 పడకలతో ఏర్పాటు చేసినటువంటి ఈ కేర్ సెంటర్ లో ఆక్సిజన్ లెవెల్స్ – డాక్టర్స్ – పారామెడికల్ – అంబులెన్సులు ఇలా అన్నివిధాలా సహకారం అందించనున్నట్లు తెలిపారు. అలాగే కోవిడ్ బాధితులకు పూర్తి ఉచితంగా వైద్యం చేయనున్నట్లు మజిందర్ సింగ్ ప్రకటించారు. దేశంలో ఇప్పటికి బెడ్స్ కొరత ఏర్పడింది. త్వరలోనే మరిన్ని పడకలు ఏర్పాటు చేస్తామని ఆయన మాటిచ్చారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కోవిడ్ తో ఫైట్ చేసేందుకు ఆర్థికంగా సహకారం అందిస్తూనే ఉన్నారు. అమితాబ్ విషయం తెలిసి ప్రస్తుతం సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here