డై హార్డ్ టాక్: ప్రభాస్ మూడుముక్కలాట

0
14

డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు స్వీట్ న్యూస్. డైహార్డ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ఆ మూడు రిలీజ్ తేదీల్ని లాక్ చేసిన ప్రభాస్ నిరంతర షెడ్యూళ్లతో అనుకున్న సమయానికి ఏదీ మిస్ కాకుండా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అతడి షెడ్యూల్స్ ని ఒకసారి పరిశీలిస్తే తెలిసిన ఆసక్తికర విషయాలివీ..

గత కొన్ని నెలలుగా స్టార్ హీరో ప్రభాస్ మూడు ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాధే శ్యామ్.. ఆదిపురుష్ 3డి .. సలార్ చిత్రాల గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆదిపురుష్ 3డి- సలార్ చిత్రీకరణల్లో ప్రభాస్ సైమల్టేనియస్ గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ముంబైలో ఉన్నారు. ఆదిపురుష్ చిత్రీకరణలో పాల్గొంటున్నారని సమాచారం.

వచ్చే వారం `రాధే శ్యామ్` పెండింగ్ చిత్రీకరణను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కొత్త షెడ్యూల్ ను తిరిగి ప్రారంభించడానికి ప్రభాస్ హైదరాబాద్ కు వస్తారని తెలిసింది. అతను ఈ నెల చివరి నాటికి రాదేశ్యామ్ చిత్రీకరణ సాంతం ముగిస్తారు.

ఆపై సలార్ చిత్రీకరణ కోసం ప్రభాస్ గుజరాత్ వెళ్తారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం ఇప్పటికే భారీ సెట్లు నిర్మిస్తున్నారు. రాధే శ్యామ్ జూలై 30 న విడుదల కానుండగా ప్రచారంపైనా ప్రభాస్ దృష్టి సారిస్తారు. అలాగే సలార్ 14 ఏప్రిల్ 2022 కి విడుదలవుతుండగా.. ఆదిపురుష్- 3డి 13 ఆగస్టు 2022న రిలీజవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here