‘డి కంపెనీ’ తో వర్మ మరో ప్రయోగం

0
31

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలను చేసిన విషయం తెల్సిందే. ఆయన చేసిన ప్రయోగాలు ఆయన చేసిన విభిన్నమైన సినిమాలు ఇండియన్ స్క్రీన్ పై మరెవ్వరు చేయలేదు అనడంలో సందేహం లేదు. అలాంటి రామ్ గోపాల్ వర్మ గత ఏడాది వరుసగా ఏటీటీ సినిమాలను పే పర్ వ్యూ పద్దతిన విడుదల చేశాడు. అందరు ఫిల్మ్ మేకర్స్ ఖాళీగా ఉన్న సమయంలో వర్మ తన సినిమాలతో సందడి చేశాడు. ఇక ఈ ఏడాది ఆరంభంలో వర్మ హిందీ తెలుగు ‘డి కంపెనీ’ చిత్రంతో హడావుడి చేశాడు. మార్చి 26న డి కంపెనీ విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా వేయడం జరిగింది. థియేటర్లు మళ్లీ ఎప్పటికి పునః ప్రారంభం అయ్యేది క్లారిటీ లేదు. దాంతో డి కంపెనీ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

‘డి కంపెనీ’ సినిమా విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఓటీటీల ద్వారా కాకుండా నిర్మాణ సంస్థకు చెందిన సొంత ఓటీటీ స్పార్క్ ద్వారా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. స్పార్క్ ఓటీటీ లో ఈ సినిమా ను పే పర్ వ్యూ పద్దతిన చూడవచ్చా లేదంటే మరేదైనా కొత్తపద్దతిన ఈ సినిమా ను చూసే అవకాశంను వర్మ కల్పిస్తాడా అనేది చూడాలి. వర్మ ఏం చేసినా కూడా కమర్షియల్ గా లాభం వచ్చేలా ఆలోచిస్తాడు అనే టాక్ ఉంది. కనుక ఆయన ఈ సినిమా తో ఖచ్చితంగా నిర్మాతలకు లాభాలు దక్కేలా చేస్తాడు.

డి కంపెనీ సినిమా విషయానికి వస్తే ముంబయి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలను ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ మరియు పోస్టర్ లు సినిమా పై ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. వర్మ పోస్టర్ లు మరియు టీజర్ లు ఆసక్తిని కలిగిస్తాయి కాని సినిమాలు మాత్రం మెప్పించడం లేవు. గతంలో వచ్చిన పలు సినిమాలకు అదే పరిస్థితి ఏర్పడింది. కాని డి కంపెనీ విషయంలో మాత్రం అలా కాదేమో అనిపిస్తుందని ఆయన అభిమానులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here