ట్రెండ్డింగ్ లో ఉన్న ‘వకీల్ సాబ్’ సూపర్ ఉమెన్.. పవన్ వల్లే ఇది జరిగిందట!

0
23

వకీల్ సాబ్ సినిమాలో కనిపించిన లేడీ ఇన్సిపెక్టర్ గా కనిపించిన నటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెడ్డింగ్ లో నిలిచారు. సినిమాలో ఆమెకు పవన్ కళ్యాణ్ సూపర్ ఉమెన్ అనే ట్యాగ్ ఇచ్చాడు. కోర్టు సీన్ లో ఆమెను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ మీరు సూపర్ ఉమెన్ అంటూ సంబోధిస్తాడు. అల్వాల్ నుండి మొయినాబాద్ కు మీరు కేవలం 15 నిమిషాల్లో వచ్చిన మీరు సూపర్ ఉమెన్ అంటూ ఆమెను ఉద్దేశించి పవన్ చెప్పిన డైలాగ్ అందరికి నవ్వు తెప్పిస్తుంది. లేడీ ఎస్సై పాత్ర ఉన్నది కొద్ది సమయం అయినా కూడా పవన్ తో సూపర్ ఉమెన్ అనిపించుకోవడం వల్ల ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఆమె కనిపిస్తుంది.

ఆ లేడీ ఎస్సై అసలు పేరు లిరిష. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. సినిమా మరియు బుల్లి తెరపై చిన్న చిన్న పాత్రలతో కొనసాగుతూ వస్తున్న ఈమె కు వకీల్ సాబ్ సినిమా తో అందరు గుర్తించే పాత్ర దక్కింది. వకీల్ సాబ్ విడుదల అయిన తర్వాత రిలిష చాలా బిజీ అయ్యింది. ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న లిరిష కు మరో వైపు నటిగా కూడా ఆఫర్లు వస్తున్నాయట. దీనికి అంతటికి కారణం ఖచ్చితంగా హీరో పవన్ కళ్యాణ్ అంటూ లిరిష ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు.

ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… షూటింగ్ సమయంలోనే సూపర్ ఉమెన్ అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ మార్చారు. సూపర్ ఉమెన్ అంటూ సంభోదిస్తూ డైలాగ్ చెప్పడం వల్ల ఖచ్చితంగా మరింత బలంగా సీన్ పండుతుందని ఆయన భావించారు. అప్పటికప్పుడు సూపర్ ఉమెన్ డైలాగ్ ను చేర్చడం జరిగిందని లిరిష అన్నారు. ఆ డైలాగ్ వల్లే ఇప్పుడు తాను ఇంతగా పాపులారిటీని దక్కించుకున్నట్లుగా చెబుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాలో చిన్న పాత్ర దక్కినా కూడా ఎక్కడికో వెళ్లిపోవచ్చు అలాంటిది ఆయన సూపర్ ఉమెన్ అంటూ డైలాగ్ చెప్పిన లిరిష కు ఆఫర్లు వెళ్లువెత్తడం ఖాయం అంటున్నారు.

వకీల్ సాబ్ కోర్టు సీన్ లో పవన్ అద్బుతంగా నటించడంతో పాటు ఇలా డైలాగ్ కాస్త మార్చడం మరియు స్క్రిప్ట్ విషయంలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు అప్పటికప్పుడు చెప్పడం వంటివి చేయడం వల్లే పింక్ రీమేక్ అయిన వకీల్ సాబ్ కు కమర్షియల్ సక్సెస్ దక్కిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పింక్ ను ఉన్నది ఉన్నట్లుగా చేస్తే ఖచ్చితంగా జనాలు పట్టించుకునే వారు కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here