టీనేజ్లోకి వచ్చిన చిరంజీవి మనవరాలు.. హైట్లో మెగా హీరోలను టచ్ చేసేలా..

0
8

మెగాస్టార్ చిరంజీవి ఎంత కష్టపడి స్టార్ హోదాను అందుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ వారి కుటుంబ సభ్యులకు ఒక ప్రత్యేకమైన దారిని చూపించాడు. ఇక ఫ్యామిలీలో అందరూ సంతోషంగా ఉండాలని ఎంతో బాధ్యత తీసుకుంటారు. మనవళ్ళు, మనవరాళ్ళతో కూడా మెగాస్టార్ ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఇటీవల శ్రీజ పెద్ద కూతురు టీనేజ్ వయసులోకి వచ్చేసింది. మెగాస్టార్ తామే పుట్టినరోజును సందడిగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

మనవరాళ్ళతో మెగాస్టార్ అనుబంధం

మెగాస్టార్ చిరంజీవి షూటింగ్స్ తో అలసిపోయినప్పుడు కాస్త బ్రేక్ తీసుకున్నాడు అంటే ఆ బ్రేక్ లో చిన్నారులు ఉండాల్సిందే. ఇంటి నిండా మనవళ్ళు, మనవరాళ్లతో ఆడుకుంటూ ఉంటారు. ఎక్కువగా శ్రీజ కూతుళ్లు మెగాస్టార్ చిరంజీవితోనే ఉంటారు. వారికి సంబంధించిన ఫొటోలను వీడియోలను కూడా చాలాసార్లు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

నివృతి బర్త్ డే సెలబ్రేషన్స్

ఇక ఇటీవల శ్రీజ పెద్ద కుమార్తె నివృతి పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించారు. ఆ అమ్మాయి 13లోకి వచ్చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో రెండు చోట్ల కేక్స్ కట్ చేసింది. తన స్నేహితులే కాకుండా తల్లి శ్రీజ, తండ్రి కళ్యాణ్ దేవ్ కూడా శ్రీజ పుట్టినరోజును సందడిగా నిర్వహించారు.

హైట్ తో షాక్ ఇచ్చిన నివృతి

ఇక టీనేజ్ లోకి అలా వచ్చిందో లేదో నివృతి తన హైట్ తో షాక్ ఇస్తోంది. అప్పుడే తల్లికి తగ్గట్లుగా ఎదిగిపోయింది. ఇక మెగా హీరోల హైట్ బ్రీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కువగా తాతల పొలికకు తగ్గట్లుగా నివృతి హైట్ తో షాక్ ఇస్తోంది. నివృతి ఎక్కువగా మెగాస్టార్ తో ఉండడానికి ఇష్టపడుతుంది.

మెగాస్టార్ లైనప్ మూవీస్

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. ఇక మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ తో పాటు, బేబి, మెహర్ రమేష్ సినిమాలను కూడా లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here