టీఎన్నార్ కుటుంబానికి చిరంజీవి – సంపూర్ణేష్ బాబు ఆర్థిక సాయం..!

0
23

ప్రముఖ సినీ జర్నలిస్ట్ నటుడు టీఎన్నార్ (తుమ్మల నరసింహారెడ్డి) సోమవారం కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలోనూ మీడియా రంగంలోనూ మంచి పేరున్న టీఎన్నార్ మహమ్మారి వైరస్ కి బలవడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. టీఎన్నార్ మృతి గురించి తెలుసుకున్న చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి.. ఫోన్ లో టీఎన్ఆర్ భార్య జ్యోతితో మాట్లాడి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. టీఎఎన్నార్ ఇంటర్వ్యూలు కొన్ని చూశానని.. చాలా సహజంగా ఉంటాయనే విషయాన్ని చిరు గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా టీఎన్నార్ కుటుంబానికి చిరంజీవి తక్షణ సాయంగా రూ.1 లక్ష అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని సురేష్ కొండేటి ద్వారా టీఎన్నార్ భార్యకు అందజేశారు. చిరంజీవి ఫోన్లో పలకరించడం పట్ల స్పందించిన టీఎన్నార్ సతీమణి ”చిరంజీవి అంటే ఆయనకు ఎంతో ఇష్టం. 200వ ఇంటర్వ్యూ చిరంజీవి గారితో చేయాలనేది ఆయన డ్రీమ్. అయితే అది తీరకుండానే చనిపోయారు” అని కన్నీటిపర్యంతం అయ్యారు.

అలానే నటుడు సంపూర్ణేశ్ బాబు కూడా టీఎన్నార్ కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. టీఎన్నార్ భార్య జ్యోతి బ్యాంకు ఖాతాలో రూ.50 వేలు డిపాజిట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంపూర్ణేశ్ బాబు.. టీఎన్నార్ ఇంటర్వ్యూ ద్వారా తాను వ్యక్తిగతంగా కెరీర్ పరంగా ఒక మెట్టు పైకి ఎదిగానని తెలిపారు. ఆయన కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తన వంతు సాయం తప్పకుండా చేస్తానని సంపూర్ణేష్ మాటిచ్చారు. అందరూ టీఎన్నార్ కుటుంబానికి ఆసరాగా నిలవాలని కోరుతూ.. తన ట్వీట్ లో టీఎన్నార్ భార్య బ్యాంకు అకౌంట్ నెంబర్ తదితర వివరాలను షేర్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here