టాలీవుడ్ నెం1 స్థానం మహేష్ దే.. ఆ తర్వాత ఎవరెవరంటే.. మీడియా సంస్థ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ !

0
12

టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు? అనే ఈ ప్రశ్నకు పాపులర్ సర్వే కంపెనీ అయిన ఆర్మాక్స్ మీడియా ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి వివరాలు వెల్లడిస్తోంది. తాజాగా జూన్ నెలకు గాను టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో మహేష్ బాబు నిలవగా ఆ తరువాత రెండో స్థానంలో అల్లు అర్జున్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు.

1-మహేష్ 2-అల్లు అర్జున్

ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరీలో మహేష్ బాబు మొదటి స్థానం నిలబెట్టుకున్నారు. ఏప్రిల్, మే నెలలలో కూడా ఆయన అదే స్థానంలో నిలవగా ఇప్పుడు అదే స్థానం సాధించారు. చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ఈ కేటగిరీలో అల్లు అర్జున్ రెండో స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకున్నారు. చివరిగా అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు.

3- పవన్ కళ్యాణ్ 4-ప్రభాస్

ఇక ఈ జాబితాలో పవన్ మూడో స్థానానికి ఎగబాకారు. గతంలో నాలుగో స్థానంలో ఉన్న ఆయన ఇప్పుడు నాలుగో స్థానానికి చేరారు. ఈ మధ్య వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు ఒప్పుకుని బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఒక మలయాళ సినిమా రీమేక్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగో స్థానానికి దిగజారారు. గతంలో మూడో స్థానం రాగా ఇప్పుడు ఒక స్థానం కిందికి దిగజారారు. చివరిగా సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

5- ఎన్టీఆర్ 6-రామ్ చరణ్

ఈ జాబితాలో ఎన్టీఆర్ 5వ స్థానానికి పరిమితం అయ్యారు. గత నెలలో కూడా ఆయన ఇదే స్తానంలో ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.ఇక ఈ జాబితాలో రామ్ చరణ్ ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు.

7-విజయ్ దేవరకొండ 8-నాని

ఈ జాబితాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏడవ స్థానానికి ఎగబాకారు. గత నెలలో ఎనిమిదో నెంబర్లో ఉన్న ఆయన ఒక స్థానం ఎగబాకారు. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని ఈ జాబితాలో ఎనిమిదో స్థానానికి దిగజారారు. చివరిగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఇప్పుడు టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

9-చిరంజీవి 10-రవితేజ

ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మాస్ మహారాజా రవితేజ ఈ జాబితాలో పదో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఏడాది క్రాక్ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here