టాలీవుడ్ నెం1 సమంతే.. కొట్టేవాళ్ళు లేరుగా.. టాప్ టెన్ లో కీలక మార్పులు… మీడియా సంస్థ షాకింగ్ సర్వే

0
12

ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఎప్పటిలాగే ఈ ఏడాది జూన్ నెలకు గాను టాప్ 10 తెలుగు హీరోలు, హీరోయిన్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సర్వేలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు హీరోగా మహేష్ బాబు మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా ఆ తర్వాతి స్థానాల్లో అల్లు అర్జున్, తమ స్థానాలు నిలుపుకున్నారు. ఇక హీరోలను ప్రకటించినట్టుగానే హీరోయిన్స్ జాబితాను కూడా రిలీజ్ చేయగా అందులో కొన్ని ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి.

1 – సమంత అక్కినేని 2 – కాజల్ అగర్వాల్

టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ ఫిమేల్ కేటగిరీలో సమంత మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా జాను అనే సినిమాలో కనిపించిన ఆమె ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, అలాగే ఒక తమిళ సినిమాలో నటిస్తోంది. అలాగే కాజల్ అగర్వాల్ రెండో స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకుంది. చివరిగా మోసగాళ్లు అనే తెలుగు సినిమాలో కనిపించిన ఈ భామ ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. అలాగే తెలుగులో చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తోంది.

3- అనుష్కశెట్టి 4- తమన్నా

అయితే ప్రస్తుతానికి సినిమాలకి గ్యాప్ ఇచ్చిన అనుష్క ఈ జాబితాలో ఈ నెలలో కూడా మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాతో మన ముందుకు వచ్చిన అనుష్క ఇప్పటికీ మరో సినిమాని అనౌన్స్ చేయలేదు. నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేస్తున్నారని అంటున్నారు. అయితే అనూహ్యంగా మిల్కీ బ్యూటీ తమన్నా ఈ జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకింది. గతంలో ఆమె ఆరో స్థానం సంపాదించింది. తెలుగులో ఎఫ్ త్రీ, గుర్తుందా శీతాకాలం మాస్ట్రో సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది.

5- రష్మిక మందన్నా 6- కీర్తి సురెష్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ జాబితాలో ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా సుల్తాన్ అనే సినిమాలో కనిపించిన ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాలో నటిస్తోంది. అలాగే రెండు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. కీర్తి సురేష్ ఈ జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకారు. ఈ ఏడాది రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

7- పూజా హెగ్డే 8- రాశి ఖన్నా

ఇక బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ జాబితాలో నాలుగో స్థానం నుంచి ఏడో స్థానానికి దిగజారింది. గత లిస్టులో ఆమె నాలుగో స్థానం సంపాదించింది. ఇక చివరిగా అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమా చేస్తోంది. అలానే అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా చేస్తోంది. రాశి ఖన్నా ఈ జాబితాలో పదో స్థానానికి దిగజారింది. అంతకు ముందు ఆమె తొమ్మిదో స్థానంలో ఉండేది. ఇక చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశి ఖన్నా ప్రస్తుతానికి పక్కా కమర్షియల్ అలాగే థాంక్యూ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

9- రకుల్ ప్రీత్ సింగ్ 10 – సాయి పల్లవి

రకుల్ ప్రీత్ సింగ్ ఈ జాబితాలో తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా చెక్ సినిమాలో మానస పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ క్రిష్ దర్శకత్వంలో చేసిన కొండపొలం అనే సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇక హీరోయిన్ సాయి పల్లవి పదో స్థానానికి దిగజారింది. గత నెలలో ఆమె ఎనిమిదో స్థానలో నుంది. సాయి పల్లవి ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాతో, విరాటపర్వం సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. మరో పక్క ఆమె శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here