టాలీవుడ్ ఆఫర్ల కోసమేనా యాంకర్ అంత హాట్ గా!?

0
25

సోషల్ మీడియాల్లో యాంకర్ కం నటీమణుల హంగామా చూస్తున్నదే. ప్రముఖ బుల్లితెర యాంకర్ వర్షిణి కూడా ఇటీవల వేడెక్కించే ఫోటోషూట్లతో అంతర్జాలంలో వేడి పెంచుతున్నారు. తాజాగా వర్షిణి షేర్ చేసిన ఓ హాట్ ఫోటోషూట్ పై ఇన్ స్టా వేదికగా డిబేట్ కి తెర తీసింది.

అనసూయ.. రేష్మి తరవాత ఈ భామ పేరు వేడెక్కించే ఫోటోషూట్లతో మార్మోగుతోంది. తాజాగా ఈ బ్యూటీ టైట్ ఫిట్ డ్రెస్ లో అందాల్ని ప్రదర్శించింది. వైట్ ఫ్రాకు ధరించి బాటమ్ లెస్ లుక్ తో వర్షిణి అందచందాలు యువతరాన్ని మైమరిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

వర్షిణి కెరీర్ సంగతులు చూస్తే.. ఈటీవీ2 లో కామెడీ షోలు ఫన్ ఎంటర్ టైనర్ కార్యక్రమాలు సహా పలు బుల్లితెర కార్యక్రమాల్లోనూ వర్షిణి కనిపిస్తోంది. ఢీ నుంచి బయటికి వచ్చాక.. ప్రస్తుతం వర్షిణి సౌందరాజన్ స్టార్ మాలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే `కామెడీస్టార్స్` షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఇంతకుముందు వర్షిణి పెద్ద తెరపైనా ప్రయత్నించింది. మరోసారి టాలీవుడ్ లో మెరుపులు మెరిపించేందుకు గట్టి పంతంతో ప్రయత్నాలు సాగిస్తోందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here