జూ.ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్..!

0
70

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కోవిడ్ వాక్సినేషన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడమే కాకుండా.. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీ కూడా మహమ్మారి గుప్పిట్లో చిక్కుకుంది. సినీ ప్రముఖులు వరుసపెట్టి కరోనా బారిన పడుతున్నారు. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. కొందరు చికిత్స తీసుకొని బయటపడ్డారు. అయితే తాజాగా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తారక్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు.

కరోనా నిర్ధారణ టెస్ట్ లో పాజిటివ్ గా తేలిందని ప్రస్తుతం తనతో పాటుగా ఫ్యామిలీ మొత్తం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నామని ఎన్టీఆర్ ట్వీట్ చేసారు. ఎవరూ బాధ వద్దని.. ఇటీవల కాలంలో తనని కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని తారక్ కోరారు. ”కోవిడ్-19 పరీక్షలో నాకు పాజిటివ్  వచ్చింది. దయచేసి ఎవరూ చింతించకండి. నేను బాగానే ఉన్నాను. నేను మరియు నా కుటుంబం ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాం. మేము వైద్యుల పర్యవేక్షణలో అన్ని ప్రోటోకాల్ లను అనుసరిస్తున్నాము. గత కొన్ని రోజులుగా నాతో సంప్రదించిన వారిని టెస్టులు చేయించుకోమని నేను అభ్యర్థిస్తున్నాను. సురక్షితంగా ఉండండి” అని ఎన్టీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here