జుట్టులేని బట్టతల క్యారెక్టర్ చేస్తాను: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

0
24

సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి రోల్ అయినా చేయడానికి సిద్ధంగా ఉంటారు హీరోలు హీరోయిన్స్. ప్రస్తుతం అలాంటి పాత్రలలో జుట్టులేని పాత్ర ఇచ్చినా చేసెందుకు సిద్ధంగా ఉన్నాను అంటోంది టాలీవుడ్ గ్లామర్ డాల్. 2014లో శర్వానంద్ సరసన ‘రన్ రాజా రన్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది హీరోయిన్ సీరత్ కపూర్. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ ముంబైభామ.. అదే ఏడాది ‘జిద్’ అనే రొమాంటిక్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్యూ చేసింది. రాక్ స్టార్ సినిమాకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పనిచేసిన ఈ అమ్మడిని రన్ రాజా రన్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసాడు డైరెక్టర్ సుజీత్. ఫస్ట్ సినిమాతోనే మంచి ఇంప్రెషన్ కొట్టేసిన ఈ భామ వరుసగా అవకాశాలను అందుకుంది. రన్ రాజా రన్ సినిమా తర్వాత టైగర్ కొలంబస్ లాంటి సినిమాలు చేసింది సీరత్. కానీ సినిమాలకు మంచి పేరు వచ్చినా ఈ భామకి మాత్రం గుర్తింపు రాలేదు.

అనంతరం కింగ్ నాగార్జునతో ‘రాజుగారిగది 2’.. అల్లుశిరీష్ నటించిన ‘ఒక్కక్షణం’ సినిమాలతో పాటు మాస్ రాజా రవితేజ సరసన ‘టచ్ చేసి చూడు’ సినిమాలో మెరిసింది. కానీ ఏ సినిమా కూడా సీరత్ కు బ్రేక్ ఇవ్వలేక పోయాయి. కానీ సీరత్ తన ఫస్ట్ మూవీ నుండి కూడా గ్లామర్ షోలో ఎక్కడ తగ్గలేదు. సీరత్ నటించిన అన్నీ సినిమాలో గ్లామర్ షో మినిమమ్ గ్యారంటీ. అయితే రాజుగారిగది-2లో మాత్రం ఏకంగా బికినీ వేసి మాయచేసింది. సీరత్ ఎంతగా గ్లామర్ షో చేసినా హిట్స్ మాత్రం రాలేదు. నిజానికి ఈ భామ మూవీ సెలక్షన్స్ లో వీక్ అని భావించక తప్పేలా లేదు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే.. సీరత్ హెయిర్ స్టైల్ అంటే ఫ్యాన్స్ బాగా ఇష్టపడతారు. కర్లీ హెయిర్ తో అలా కుర్రాళ్లను వలలో వేసుకుంది.

అప్పుడప్పుడు అదిరిపోయే ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా అమ్మడు తనకు బట్టతల లాంటి జుట్టులేని క్యారెక్టర్ ఇచ్చినా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపి షాకిచ్చింది. అందరికి షాకింగ్ అనిపించినా.. క్యారెక్టర్ డిమాండ్ బట్టి – దానికున్న ఇంపార్టెన్స్ బట్టి తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చింది. అలాగే ఫ్యాన్స్ ఎల్లప్పుడూ నా హెయిర్ స్టైల్ ఇష్టపడతారని తెలుసు. ఇప్పటివరకు నా హెయిర్ స్టైల్ పై చాలా అభిమానం చూపించారు. అయితే నేను ఒకసారి అసలు జుట్టు లేకుండా క్యారెక్టర్ చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో.. అప్పుడు ఈ ఉత్సాహం కనిపిస్తుందేమో చూడాలని అంటోంది అమ్మడు. ఇటీవలే మా వింతగాథ వినుమా సినిమాలో నటించింది. త్వరలోనే బాలీవుడ్ నసీరుద్దీన్ షా – తుషార్ కపూర్ లతో ‘మారిచ్’ అనే సినిమాలో నటించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here