జాన్వీ కపూర్ పెళ్లి.. బ్యాచిలర్ పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందట.. ఏకంగా ఖండాలు దాటి..

0
11

ఇండియన్ సినిమా హిస్టరీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న శ్రీదేవి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలు చేసింది. ఇక ఆమె మరణం అందరిని షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. ఇక శ్రీదేవి వారసత్వాన్ని అంది పుచ్చుకొని కూతురు జాన్వీ కపూర్ స్టార్ గా అడుగులు వేస్తోంది. ఇక ఆమె తన పెళ్లిపై మరోసారి క్లారితో ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి కోసం ఎంత ఖర్చు చేయడానికైనా కూడా రెడీ అని అంటోంది.

సరైన సక్సెస్ చూడలేదు

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్న జాన్వీ కపూర్ బాక్సాఫీస్ వద్ద అయితే ఇంకా సరైన సక్సెస్ చూడలేదు. గ్లామర్ పరంగా అయితే ఆమె అగ్ర హీరోయిన్స్ కు తీసిపోని విధంగా గట్టిగానే పోటీ ఇస్తోంది. రోజుకో ఫోటోతో సోషల్ మీడియాలో దర్శనమిస్తూ కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. బికినీ ఫోటో షూట్స్ తో అయితే చాలాసార్లు దర్శనమిచ్చింది.

రోజురోజుకు ఎక్కువవుతోంది

ఇన్స్టాగ్రామ్ లో జాన్వీ ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజురోజుకు ఎక్కువవుతోంది. నేటితరం అగ్ర హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా అయితే బాగానే కష్టపడుతోంది. ఫిట్నెస్ విషయంలో కూడా అమ్మడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ రోజుల్లో ఒకే రకంగా గ్లామర్ తో ఎక్కువ రోజులు కొనసాగడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. అయితే ఇంకా ఈ బ్యూటీ నటన విషయంలో మాత్రం చాలానే నేర్చుకోవాల్సి ఉంది.

అందులో ఎలాంటి నిజం లేదని

ఇక గతంలో జాన్వీ కపూర్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని జాన్వీ చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా పెళ్లి అంటే తన సొంత నిర్ణయం కాదని ఆ విషయంలో సాంప్రదాయం బద్ధంగా నడుచుకోవాలని అనుకుంటున్నట్లు ఓపెన్ గానే చెప్పేసింది.

కులం మతం అని తేడా చూడను

వరుడు కులం మతం అని తేడా చూడను. కానీ నా పెళ్లి మాత్రం తిరుపతిలోనే జరగాలని అమ్మ కోరిక.. అలాగే అమ్మ కోరిక నెరవేర్చడం తన కోరిక కూడా అంటూ పాజిటివ్ గా కామెంట్ చేసింది. శ్రీదేవికి తిరుపతి వెంకన్న స్వామి అంటే అపారమైన భక్తి. చాలాసార్లు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. ఇక అందుకే జాన్వీ కూడా హిందు సాంప్రదాయం ప్రకారం తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుందట.

అందుకోసం కోట్ల రూపాయల ఖర్చు

ఇక ఇటీవల అమ్మడు మరొక ముఖ్యమైన విషయం గురించి కూడా క్లారిటీ ఇచ్చేసింది. పెళ్లి సెట్టయితే గనక తన బ్యాచిలర్ పార్టీని మాత్రం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాను అని జాన్వీ వివరణ ఇచ్చింది. ఇటలీలోని కాప్రీ ఐలాండ్ లోని ఒక ప్రైవేట్ క్రూయిజ్‌లో తన స్నేహితులతో కలిసి పార్టీని చేసుకుంటాను అని జాన్వీ తెలిపింది. అందుకోసం కోట్ల రూపయలు ఖర్చు చేయడానికైనా సిద్ధమేనేట ఇక పార్టీ అయిపోగానే తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకుంటానని కూడా వివరణ ఇచ్చింది.

ఫోకస్ మొత్తం కూడా కెరీర్ పైనే

ఇక ప్రేమ పెళ్లి వంటి వ్యవహారం ఇప్పట్లో అయితే ఉండదని అంటూ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కూడా కెరీర్ పైనే ఉన్నట్లు జాన్వీ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 24 మాత్రమే. ఇక సినిమాల ఎంపిక విషయంలో తొందరపడకుండా కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఎక్కువగా సీనియర్ నటీనటులతో సన్నిహితంగా ఉంటూ వారి నుంచి కూడా సలహాలు అందుకుంటోంది. ప్రతి రోజు ఒక పాఠమే అనేలా ముందుకి సాగుతోంది.

సినిమాల విషయానికి వస్తే

ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే ధడక్ సినిమాతో బాలీవుడ్ తెరకు ఎంట్రీ ఇచ్చిన జాన్వీ అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక గుంజన్ సక్సెనా బయోపిక్ లో నటనకు మంచి కామెంట్స్ అందినప్పటికి ఆ సినిమా కూడా పూర్తి స్థాయిలో అయితే సక్సెస్ కాలేదు. సడన్ గా లాక్ డౌన్ రావడం వలన నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా విడుదల అయ్యింది.ఇక ప్రస్తుతం అమ్మడి చేతిలో అయితే డోస్థానా 2 వంటి ఇంట్రెస్టింగ్ సినిమాలే ఉన్నాయి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here