జనాలు ఏది చూడాలనుకుంటారో అదే చూస్తారు.. బిగ్‌బాస్ బ్యూటీ ఆ రెండింటిలో డిఫరెంటే!!

0
84

బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వీ మడివాడ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చలికాలంలోనే వేడిని పుట్టించేలా హాట్ హాట్ ఫోటోలతో ఫాలోవర్స్, ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, పెట్టిన క్యాప్షన్ రెండూ వైరల్ అవుతున్నాయి. అసలే నిన్నటి బర్త్ డే పార్టీ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా తేరుకోలేదేమో గానీ అందాల విందుతో నెటిజన్ల మతులు పోగొడుతోంది.

బర్త్ డే హంగామా..
తేజస్వీ తన బర్తే డే (జూలై 3) హంగామా మామూలుగా లేదు. తన గ్యాంగ్‌తో చేసిన రచ్చ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తన ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో సరదగా ఎంజాయ్ చేసింది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ల విషెస్‌తో సోషల్ మీడియాలో మొత్తం తేజస్వీ బర్త్ డే దుమ్ములేచిపోయింది.

భర్త అంటూ ఓ ఫోటో..
తేజస్వీ తన బర్త్ డే వేడుకలో సందర్భంగా ఒకరి ఫోటోను షేర్ చేసింది. అందులో మై హస్బండ్ అని రాసి ఉండటంతో తేజస్వీకి పెళ్లి కుదిరిందా?పెళ్లి అయిపోయిందా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత వరకు తేజస్వీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు గానీ హాట్ హాట్ ఫోటోలతో మాత్రం నానా రచ్చ చేస్తోంది.

కమిట్‌మెంట్ పోస్టర్స్..
బర్త్ డే సందర్భంగా తేజస్వీ నటిస్తోన్న కమిట్‌మెంట్ అనే వెబ్ సిరీస్ నుంచి హాట్ ఫోటోను రిలీజ్ చేశారు. ఇక అంత హాట్‌గా ఉన్న తేజస్వీ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే అందులో భాగంగా చేసిన ఫోటో షూట్‌లోంచి మరికొన్ని ఫోటోలను తాజాగా షేర్ చేసింది.

ఏది కావాలే అది చూస్తారు..
తేజస్వీ హాట్ ఫోటోలను షేర్ చేయడమే కాదు.. వాటికి తగ్గట్టుగా క్యాప్షన్ కూడా పెడుతుంది. వేసుకునే దుస్తులతో పాటు అభిప్రాయాన్ని మార్చుకుంటున్నట్లైతే అలాంటి అభిప్రాయం తనకు అవసరం లేదని చెప్పుకొచ్చింది. తాజాగా అదిరిపోయే ఓ ఫోటోను షేర్ చేస్తూ.. జనాలు ఏది చూడాలని అనుకుంటారో అదే చూస్తారని చెప్పుకొచ్చింది. ఇలా హాట్ ఫోటోలు షేర్ చేయడం, దానికి తగ్గట్టు క్యాప్షన్స్ పెట్టడంలో తేజస్వీ డిఫరెంట్ అని నిరూపించుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here