ఛీ ఛీ అంటూ దివి నిజస్వరూపం బయటపెట్టిన అమ్మా రాజశేఖర్

0
31

బిగ్‌బాస్ ఇంటిలో దివి, అమ్మా రాజశేఖర్ మధ్య గమ్మత్తయిన సంభాషణ జరిగింది. దివిపై అమ్మా రాజశేఖర్ సెటైర్ వేస్తూ కొన్ని కామెంట్లు చేశారు. నీకు మనుషుల కంటే బొమ్మలే ముఖ్యమై పోయాయి. నీకు ప్రాణాలు లేని బొమ్మలే నీకు ఎక్కువ అంటూ అమ్మా రాజశేఖర్ మధ్య చిన్న ఎమోషనల్ చర్చ జరిగింది. ఈ చర్చ వారి మధ్య ఫ్రెండ్లీ నేచర్‌ను బయటపెట్టింది. ఇటీవల జరిగిన ఈ సంభాషణను బిగ్‌బాస్ అన్ సీన్ క్లిప్లింగ్‌గా ప్రసారమైంది. ఇంకా అందులో ఏముందంటే..

బొమ్మలతో మాట్లాడుతుంటావా?

బిగ్‌బాస్ ఇంటిలో దివి వద్యా బొమ్మతో మాట్లాడుకొంటూ కనిపించారు. అక్కడే ఉన్న అమ్మా రాజశేఖర్ చూసి.. మనుషులతో మాట్లాడే ధైర్యం లేదు. బొమ్మలతో మాట్లాడుకొంటున్నావా? ఛీ ఛీ అంటూ అన్నాడు. అందుకు సమాధానంగా ప్రాణాలు లేని బొమ్మలే ఎప్పుడూ ఒకేరకంగా మనతో ఉంటాయి రా అంటూ దివి సమాధానం ఇచ్చింది.

నీ ఫ్రెండ్స్ నీకు ఎదురు మాట్లాడకూడదు ..

దివి మాటలకు అమ్మా రాజశేఖర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. నీకు దగ్గరగా ఉండే వాళ్లు.. ఫ్రెండ్స్ ఏం మాట్లాడకూడదు. అందుకే నీకు బొమ్మలు ఇష్టం. అవి నీకు ఎదురు మాట్లాడవు కదా. నీవు చెప్పినట్టు అవి వింటాయి. నీ ఫ్రెండ్స్ అయితే నీకు ఎదురు సమాధానం ఇస్తారు. నీకు ఎలాంటి వాళ్లు ఇష్టం అంటే.. నీవు తిట్టినా.. కొట్టినా వారు ఎందురు మాట్లాడకూడదు కదా అంటూ అమ్మా రాజశేఖర్ అన్నారు.

మాట్లాడే బొమ్మలు ఉంటే..

తన మాటలకు దివి ఫుల్లుగా నవ్వుతుంటే.. అమ్మా రాజశేఖర్ తన ఫ్లోలో మాట్లాడుకొంటూ వెళ్లాడు. నీకు ఉండే ఫ్రెండ్స్ కేవలం బొమ్మలా ఉండాలి. ఎదురు చెప్పకూడదు. అదే మాటలు నేర్చిన బొమ్మ అయితే నీవు మాట్లాడే మాటలకు ముఖం మీద ఒక్కటిస్తుంటుంది అంటే దివి పగలబడి నవ్వింది. అలా నవ్వకు అంటూ రాజశేఖర్ కామెంట్ చేశారు.

నీకు మనుషులు అవసరం లేదు..

నా మాటలకు నీవు సమాధానం ఇవ్వనవసరం లేదు. నాకు నేను చెప్పుకొంటున్నాను అని రాజశేఖర్ అంటే.. నేను సమాధానం చెప్పడం లేదు. బొమ్మతో మాట్లాడుకొంటున్నాను అని సమాధానం చెప్పింది. నీకు బొమ్మే నీకు బెస్ట్. నీకు మనుషులు అవసరం లేదు. నీకు బొమ్మలు ఉంటే చాలూ అంటూ అమ్మా రాజశేఖర్ అంటూ అక్కడి నుంచి లేచి వెళ్లబోయాడు.

గంజీ కలుపుకొన్నావా అంటూ దివి

దివి వద్ద నుంచి రాజశేఖర్ వెళ్లిపోతుంటే.. గంజీ కలుపుకొన్నావా? అంటూ దివి అడిగింది. దాంతో గంజీ బొమ్మలు కలుపవు అంటూ సెటైర్ వేశాడు. ఇలా అమ్మా రాజశేఖర్, దివి వద్యా మధ్య గమ్మత్తయిన సంభాషణ జరిగింది. అన్‌సీన్ క్లిప్పింగ్‌గా బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రసారం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here