ఛార్మి దృష్టిలో పూరితో సహా వాళ్ళంతా తప్పు చేసినట్లేనా?

0
18

హీరోయిన్స్ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న నేపథ్యంలో ఛార్మి కూడా సమీప బంధువుని వివాహమాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు మీడియాలో మొదలయ్యాయి. మూడు పదుల వయసు దాటినా ఇప్పటిదాకా పెళ్లి ఊసెత్తని ఛార్మి ఇలా సడెన్‌గా పెళ్లికి ఓకే అనటం ఆశ్చర్యంగా ఉందంటూ కథనాలు ప్రసారం చేసేస్తున్నాయి. ఈ వార్తలు ఛార్మి దాకా చేరాయి. వెంటనే ఆమె ఖండిస్తూ ఇంకాస్త క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది.

 ప్రస్తుతం నేను జీవితంలో బెస్ట్ సమయాన్ని గడుపుతున్నాను. నేను నా జీవితంతో ఎంతో సంతోషంగా ఉన్నాను. లైఫ్‌లో పెళ్లి చేసుకోవడమనే తప్పును నేను ఎప్పడూ చేయను అంటూ కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పేసింది ఛార్మి. దాంతో వివాహ వ్యవస్థపై ఛార్మీకి ఇంతలా వ్యతిరేకత కలగడానికి కారణమేంటీ అంటూ మరికొందరు డిస్కషన్ మొదలెట్టేసారు. గతంలోనూ  పెళ్లిపై తనకు నమ్మకం లేదనీ తనకెలాంటి తోడు అవసరం లేదని ఛార్మి చెప్పిన విషయం తెలిసిందే. మొత్తానికి పెళ్లి చేసుకున్న వాళ్ళంతా తప్పు చేసినట్లే అని ఆమె తేల్చేసిందన్నమాట. అంటే పూరి జగన్నాథ్ కూడా వివాహితుడే కాబట్టి ఆయనే తప్పు చేసినట్లే.

  ఛార్మీ ప్రస్తుతం పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.  నీ తోడు కావాలి చిత్రంతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన ఛార్మి వరసగా చాలా సినిమాలు చేసింది. స్టార్ హీరోల సరసన నటించి అలరించింది. పూరి తో చేసిన జ్యోతి లక్ష్మీ తర్వాత ఆన్ స్క్రీన్‌పై కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో ఉంటోంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని హ్యాండిల్ చేసింది. ఇప్పుడు పూర్తిగా పూరీ కనెక్ట్స్ బాధ్యతలు చూసుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here