‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తర్వాతే ‘కర్ణన్’ తెలుగు రీమేక్..!

0
26

టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై డా.జయంతిలాల్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. అయితే రీసెంటుగా సాయి శ్రీనివాస్ తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కర్ణన్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న ప్రకటించడంతో ప్రస్తుతానికి ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ ని హోల్డ్ లో పెట్టారని వార్తలు వచ్చాయి.

అయితే ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కంప్లీట్ చేసిన తర్వాతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘కర్ణన్’ తెలుగు రీమేక్ లో నటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బెల్లంకొండ బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం నటీనటులు – సాంకేతిక నిపుణులను ఎంపిక చేయడమే కాకుండా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేశారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో 15 ఎకరాల్లో భారీ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ‘ఛత్రపతి’ రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మేకర్స్ ప్లాన్ చేసుకోగా.. కరోనా మహమ్మారి వచ్చి బ్రేక్ వేసింది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభన కారణంగా సినిమా షూటింగులు నిలిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయి శ్రీనివాస్ హిందీ చిత్రాన్ని స్టార్ట్ చేయలేకపోతున్నారని తెలుస్తోంది.

కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ‘కర్ణన్’ రీమేక్ స్టార్ట్ చేయాలని సాయి శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ డెబ్యూ కోసం బెల్లంకొండ భారీ వర్కౌట్స్ చేసి కండలు తిరిగిన దేహంతో అదిరిపోయే మేకోవర్ లోకి మారిపోయాడు. వీవీ వినాయక్ చేతులు మీదుగా టాలీవుడ్ లో హీరోగా లాంచ్ అయిన సాయి శ్రీనివాస్.. ఇప్పుడు ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అవుతుండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here