చైతూ – నితిన్ ల సరసన బేబమ్మ..!

0
6

కన్నడ బ్యూటీ కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. బేబమ్మ పాత్రలో నటించిన ఈ బ్యూటీ.. యువ హృదయాలను కొల్లగొట్టింది. అందంతో పాటుగా అభినయం చూపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం కృతి కోసమే ఈ సినిమాని ఎక్కువసార్లు చూసిన ఆడియన్స్ ఉన్నారంటే అమ్మడు ఏ రేంజ్ లో మాయ చేసిందో అర్థం చేసుకోవచ్చు. మొదటి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా క్రేజీ ఆఫర్స్ ఈ బ్యూటీ తలుపు తడుతున్నాయి. ఈ క్రమంలో కృతి రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు సినిమాలని చేతిలో పెట్టుకున్న ఈ భామ.. లేటెస్ట్ గా మరో రెండు తెలుగు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం.

యూత్ స్టార్ నితిన్ హీరోగా ప్రముఖ ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టి నే ఫైనలైజ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అలానే ‘బంగార్రాజు’ చిత్రంలో యువ సామ్రాట్ నాగచైతన్య సరసన కృతి హీరోయిన్ గా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ప్రీక్వెల్ గా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ‘కింగ్’ అక్కినేని నాగార్జున – నాగ చైతన్య కలిసి నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

ఏదేమైనా కృతి శెట్టి దూకుడు చూస్తుంటే టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు అమ్మడి హవానే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఉప్పెన బ్యూటీ ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నటిస్తోంది. అలానే సుధీర్ బాబు – డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో రూపొందుతున్న ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే క్రమంలో ‘ఉస్తాద్’ రామ్ పోతినేని – డైరెక్టర్ లింగుసామి కాంబినేషన్లో తెరకెక్కబోయే యాక్షన్ ఎంటర్టైనర్ లో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here