చెన్నై సాంబార్ తింటున్న అదృష్టవంతుడు శంతను!

0
25

సెల్ఫ్ లాక్ డౌన్ లో శ్రుతిహాసన్ లోని వంట నైపుణ్యం బయటపడుతోంది. తన ప్రియుడు ఎంతో ఇష్టంగా తినేందుకు అవసరమైన అన్నిటినీ వండి పెడుతోంది శ్రుతి. చెన్నై స్టైల్ సాంప్రదాయక వంటకాల్ని వండి ఆరాంగా తినిపిస్తోంది. డూడుల్ కళాకారుడు శంతను హజారికాతో శ్రుతి నిండా ప్రేమలో ఉంది. కానీ ఆ విషయాన్ని ఏనాడూ అంగీకరించదు. అతడు కేవలం స్నేహితుడు మాత్రమే అని చెబుతుంది.

ప్రస్తుత పాక్షిక లాక్ డౌన్ సమయంలో ప్రియునితో కలిసి శ్రుతి నివసిస్తున్నారు. ఇంట్లో అతడికి నోరూరించే వంటకాలను తినిపిస్తోంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఇది కనిపిస్తోంది. గత రాత్రి శంతనుతో ఆమె విందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ జంట సాంప్రదాయ రంగురంగుల తమిళ తాలిని ఆస్వాధించారు. తెల్ల బియ్యం- కూర.. చెన్నయ్ స్టైల్ సాంబార్ .. పాపడ్ ఉన్నాయి. తమిళ విందు (సాపాటు) ఆస్వాధిస్తున్న కుర్రాడు అంటూ శ్రుతి ఓ వీడియోని షేర్ చేసింది.  మలబార్ సీఫుడ్ కూరను.. రుచికరమైన కేక్ ను కూడా శ్రుతిహాసన్ పోస్ట్ చేసింది. ఈ కేక్ ల తయారీ విధానాన్ని శ్రుతి రివీల్ చేసింది.

శ్రుతి కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రభాస్ తో సలార్.. విజయ్ సేతుపతితో లాభం చిత్రీకరణలు సాగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగులు ఆలస్యమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here