చెంప పగలగొట్టి బాలయ్య అలా అన్నారా?

0
20

నటసింహా నందమూరి బాలకృష్ణకు షార్ట్ టెంపర్ (ఇలా వచ్చి అలా పోయేది) ఉందని.. కోపం వస్తే చేయి పైకి లేస్తుందని కూడా చాలా ప్రచారం ఉంది. ఆన్ లొకేషన్ ఆయన ఆర్టిస్టులపై చేయి చేసుకుంటారని.. అలాగే అభిమానులపై కోపం ప్రదర్శిస్తారని ఇంతకుముందు వీడియోల్ని వైరల్ చేశారు.

నిజానికి అవన్నీ అతడిని రాంగ్ సైడ్ చూపించాయి. కానీ బాలయ్య గురించి తెలిసిన వారు కానీ.. ఆయనతో సన్నిహితంగా ఉండేవారు కానీ చెప్పేది వేరే విధంగా ఉంటుంది. ఆయన మనస్తత్వం చిన్నపిల్లాడి తరహా. చాలా సౌమ్యంగా అందరితో కలిసిపోయే తత్వం. మంచితనంలో అతడిని మించిన వారు లేరని చెబుతుంటారు. అయితే బాలయ్యలోని నాణేనికి రెండో వైపు ఏమాత్రం ఫోకస్ కాకపోవడం దురదృష్టం.

ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక దర్శకుడి పనిలో వేలు పెట్టని హీరోగానూ బాలయ్య గురించి చెబుతారు. ఆన్ లొకేషన్ ఆర్టిస్టులతో ఆయన ఎంతో సరదాగా ఉంటారు. భేషజానికి పోరు. ఒదిగి అందరితో కలిసిపోతారు. ఇక బోలా శంకరుడిలా అన్నీ మాట్లాడుతూ నవ్వేస్తూ ఉంటారు. ఇక సీనియర్ నటుడు సమీర్ కి ఓసారి ఒక అనుభవం ఎదురైంది. ఆరోజు బాలయ్య ఆయన చెంప పగులగొట్టారు. అయితే అది సీన్ కోసం మాత్రమే. సడెన్ గా అతడు ముందుకు రావడంతో ఉంగరాల చెయ్యి బలంగానే చెంపకు తగిలిందట. అలా ముందుకు ఎందుకు వచ్చావ్? అంటూ ఆ తర్వాత బాలయ్య నవ్వేశారని తెలిపారు.

బాలయ్య చాలా స్నేహంగా ఉంటారని ఆయనకు నచ్చితే షూటింగ్ లేకపోయినా ఇంటికి పిలిచి సరదాగా టైమ్ స్పెండ్ చేస్తారని కూడా సమీర్ తెలిపారు. చెంప పై కొట్టే సన్నివేశంలో నిజంగానే కొట్టారు కానీ.. ముందుకు వెళ్లడం తన తప్పేనని సమీర్ అంగీకరించారు. రెండు మూడు సార్లు రిపీట్ గా ఆ సీన్ తెరకెక్కించారట.  చెయ్యి మొదటి సారి నెమ్మదిగా తాకినా తర్వాత అదుపుతప్పిందన్నది తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here