చిన్న గౌను వేసుకున్న పెద్ద పాపా..!

0
17

దిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ జర్నీ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాలు మరోవైపు జిమ్ ల నిర్వహణలో షెడ్యూల్స్ ఠఫ్ గానే ఉన్నాయి. ఏడాది కాలంగా కోవిడ్ వల్ల జిమ్ వ్యాపారానికి చెక్ పడిపోయినా రకుల్ ఏమాత్రం డీలా పడిపోలేదు. వరుస సినిమాలతో కెరీర్ ని చక్కదిద్దుకోవడంలో సఫలమవుతోంది.

ఇక సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. అలాగే కమర్షియల్ ప్రకటనల్ని షేర్ చేస్తూ భారీగానే ఆర్జిస్తోంది. తాజాగా హెచ్.టి బ్రంచ్ మ్యాగజైన్ కవర్ పేజీపై రకుల్ దర్శనమిచ్చింది.

అప్పుడే ఇంటర్ చదివి అలా గోల్ఫ్ కోర్ట్ లో స్టిక్ పట్టుకుని ప్లేకి రెడీ అయిపోతున్నట్టుగా ఉంది. ఇక ఈ ఫోటో చూడగానే చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప! అంటూ జాస్సీ గిఫ్ట్ ని తలవనివారు ఉండరు. పిక్చర్ పర్ఫెక్ట్ లుక్ ఇది. నీరజ కోన డిజైనర్ డ్రెస్ వ్వావ్ అనిపించేలా కిక్ ఇస్తోంది. అలా పచ్చని మైదానంలో మోకాలిని మడత వేసి ఆటకు రెడీ అవుతున్న తీరు ఇంట్రెస్టింగ్. ఇక పొట్టి గౌను తేలిపోతుంటే ఆ థై సొగసుల ఎలివేషన్ కుర్రాళ్లను గ్రౌండ్ కి పరిగెత్తేలా చేయడం గ్యారెంటీ. గుండెలకు గురి పెట్టి గోల్ఫ్ ఆడేస్తోంది రకుల్. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రకుల్ తదుపరి మేడే- డాక్టర్ జి- థాంక్స్ గాడ్-ఎటాక్ లలో కనిపించనున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన కొండపొలం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here