గోవా పిల్లతో స్టార్ హీరో కుమారుడి పెళ్లి.. కొద్దినెలలుగా సీక్రెట్‌గా అఫైర్

0
51

తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, దివంగత మురళి కుమారుడు, యువ హీరో అథర్వ త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నారనే విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది రోజుల క్రితమే తన సోదరుడు వివాహం జరిగిన విషయం తెలిసిందే. అదే జోష్‌లో యువ హీరో అథర్వ పెళ్లిని కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తున్నది. యువ హీరో అథర్వ పెళ్లి, ప్రొఫెషనల్ కెరీర్ విషయాలోకి వెళితే…

తండ్రి మురళి వారసత్వంతో

తమిళ పరిశ్రమలో మురళీ విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. తన 46వ ఏటనే గుండెపోటుతో మరణించడంతో కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని హీరోగా తమిళ, తెలుగు పరిశ్రమల్లో నిలదొక్కకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే తన తమ్ముడు ఆకాశ్ మురళీ వివాహాన్ని జరిపించారు.

గద్దలకొండ గణేష్‌తో టాలీవుడ్‌లోకి

ఇక అథ్వర్వ విషయానికి వస్తే.. బానా కథాడీ చిత్రంతో తమిళ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి సక్సెస్ ఫుల్ నటుడిగా పేరుతెచ్చుకొన్నాడు. తాజాగా తెలుగులో గద్దలకొండ గణేష్ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఆయన నటించిన 100 చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకొన్నది.

గోవా యువతితో ప్రేమలో

ఇదిలా ఉండగా, అథర్వ గోవాకు చెందిన యువతితో ప్రేమలో పడ్డారని కోలీవుడ్ పత్రికల్లో కథనాలు వచ్చాయి. గత కొద్దికాలంగా అథర్వ అఫైర్‌లో ఉన్నట్టు కథనాల్లో పేర్కొన్నాయి. అయితే అథర్వ పెళ్లికి కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. త్వరలోనే ముహుర్తాలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అని తమిళ పత్రిక కథనంలో పేర్కొన్నది.

2021లో పెళ్లి జరిగే ఛాన్స్

అయితే లాక్‌డౌన్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత అథర్వ పెళ్లి జరిగే అవకాశం ఉంది. అంతా సవ్యంగా జరిగితే 2021 జనవరిలో పెళ్లి జరిగే ఛాన్స్ ఉంది అనే విషయాన్ని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక కెరీర్ విషయానికి వస్తే.. అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి థల్లి పొగద్తే, ప్రియా భవానీ శంకర్‌తో కురుధి ఆట్టం చిత్రంలో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here