గీతా ఆర్ట్స్ ముందు జూనియర్ ఆర్టిస్టు ఆత్మాహత్యాయత్నం.. బన్నీవాసును టార్గెట్ చేస్తూ..

0
8

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం నేపథ్యంలో గత కొద్దికాలంగా నిర్మాత బన్నీవాసుపై ఆరోపణలు చేస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ సునీతా బోయ ఆత్మహత్యాయత్నం చేయడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ఆమె ఏకంగా గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుటే తీవ్రమైన చర్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది.

బన్నీవాసుపై ఆరోపణలతో

కొద్ది సంవత్సరాల క్రితం క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలను శ్రీరెడ్డి చేసిన సమయంలో సునీత బోయ మీడియాలో హైలెట్ అయింది. మెగా ఫ్యామిలీకి అండగా నిలిచిన ఈ జూనియర్ ఆర్టిస్ట్ అనూహ్యంగా టర్న్ తీసుకొన్నది. మెగా కాంపౌండ్‌లో కీలకంగా ఉన్న నిర్మాత బన్నీ వాసుపై ఆరోపణలు చేయడం సర్వత్రా ఆసక్తిని రేపింది. అయితే ఆమె ఆరోపణలను బన్నీవాసు, ఆయన పీఆర్ వర్గాలు ఖండిస్తూ వస్తున్నారు. అయితే వారి మధ్య ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడకపోగా డైలీ సీరియల్‌గా సాగతీతగా మారింది.

సినిమా అవకాశాలు ఇస్తానని చీటింగ్

సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి తనను మోసగించారని ఆరోపిస్తూ సునీత బోయ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నాలుగుసార్లు పిటిషన్ దాఖలుచేసింది. తనను చీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నది. అయితే సునీత బోయ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు అని ఆయన ఖండించారు. తనకు వ్యతిరేకంగా అవాస్తవాలు చెబుతూ తన కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారు అని బన్నీవాసు క్లారిటీ ఇచ్చారు.

రోడ్డుపై పండ్లు అమ్ముకొంటూ..

అయినా సునీత బోయ ఆరోపణలు చేయడం ఆపలేదు సరికదా.. ఇటీవల నిర్మాత బన్నీ వాసు పుట్టిన రోజున రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. ఫుట్‌పాత్‌పై పండ్లు అమ్ముతూ బన్నీ వాసుపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనపై దాడి చేసి గాయపరిచారనే విషయాన్ని మీడియాకు వెల్లడించింది. ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో

ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో పలుమార్లు సునీత బోయను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో ఆమెను చేర్పించి ట్రీట్‌మెంట్ చేయించారు. ఇలాంటి ఆరోపణల మధ్య కొద్ది రోజుల క్రితం వీడియోను రిలీజ్ చేసి.. తనను బన్నీ వాసు బెదిరిస్తున్నారు. ఇలాగే కొనసాగితే నేను ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్దం అని వార్నింగ్ ఇచ్చింది.

తాజాగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు

అయితే తాజాగా గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు సునీత బోయ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నాలను గమనించిన గీతా ఆర్ట్స్ నిర్వాహకులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దాంతో ఆమెను అరెస్ట్ చేసి సునీత బోయను కోర్టులో హాజరుపరిచారు. సునీత బోయ మానసిక పరిస్థితి సరిగా లేదని, ప్రభుత్వ మానసిక చికిత్స కేంద్రంలో పలుమార్లు ట్రీట్‌మెంట్ ఇచ్చారు అని కోర్టుకు పోలీసులు తెలిపినట్టు సమాచారం.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here