క్రైసిస్ లోనూ టాప్ 10లో నిలిచిన వకీల్ సాబ్

0
15

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కలెక్షన్ల రికార్డులు ఎప్పుడూ హాట్ టాపిక్. టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు రిలీజవుతున్నాయంటే ఎక్స్ రోడ్స్ లో కనిపించే హంగామా అంతా ఇంతా కాదు. ఇటీవల రిలీజైన వకీల్ సాబ్ మానియా ఇక్కడ ఓ రేంజులోనే కొనసాగింది. ఓవైపు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నగరంలో ఎక్కువగా ఉన్నా కానీ మరోవైపు వకీల్ సాబ్ బాక్సాఫీస్ ప్రభంజనం కొనసాగింది. ఇంత క్రైసిస్ లోనూ ఎక్స్ రోడ్స్ కలెక్షన్స్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి.  

ఆర్టీసీ ఎక్స్-రోడ్స్ లో వకీల్ సాబ్ 10 వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం మొదటి వారాంతం తరువాత వసూళ్లు డ్రాపైనా కానీ ఫర్వాలేదనిపించింది. ఉగాది రోజున కలెక్షన్లలో పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ లోని ఆర్టీసీ ఎక్స్-రోడ్స్ లో మొదటి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో వకీల్ సాబ్ 10 వ స్థానంలో నిలిచింది. కోవిడ్ వేవ్ వారం తరవాత పెద్ద దెబ్బ కొట్టింది. ఈ బుధ- గురువారాలకు మాత్రం కలెక్షన్స్ పడిపోయాయని తెలిసింది. మొదటి వారం చివరి నాటికి ఈ చిత్రం టాప్ -5 జాబితాలో నిలబడలేకపోయింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వారం టాప్ 10 గ్రాసర్స్ ని పరిశీలిస్తే… బాహుబలి 2 – రూ .16.7 కోట్లు..  సాహో – రూ .11.7 కోట్లు.. సరిలేరు నీకెవ్వరు – రూ .1.04 కోట్లు వసూలు చేశాయి. మిగతా సినిమాలు కోటి లోపు వసూళ్లను సాధించాయి. అల వైకుంఠపురములో- రూ 9295797 లక్షలు.. మహర్షి – రూ 9212430 లక్షలు..  బాహుబలి 1 – రూ .9117904 లక్షలు.. రంగస్థలం – రూ 8976555 లక్షలు..  2 పాయింట్ 0 – రూ – 8512217లక్షలు.. సైరా – రూ .8422065 లక్షలు.. వకీల్ సాబ్ – రూ 8305283 లక్షలు వసూలు చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here