‘క్రాక్’ డైరెక్టర్ తో మరోసారి రామ్?

0
22

ఇటు యూత్ ను .. అటు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలతో కథలను రెడీ చేసుకోవడంలో గోపీచంద్ మలినేని సిద్ధహస్తుడు. కథ ఎక్కడా నత్త నడక నడవకుండా చకచకా పరిగెడుతూ ఉంటుంది. కథనంలో ఆ వేగమే ఆయన సినిమాలకు ప్రధానమైన బలంగా నిలుస్తుంటుంది. ఆయన ఇంతకుముందు తెరకెక్కించిన సినిమాలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి గోపీచంద్ మలినేని .. రామ్ హీరోగా మరో ప్రాజెక్టును సెట్ చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం రామ్ .. లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగుతో పాటు తమిళంలోను విడుదల కానున్న ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా అలరించనుంది. కోలీవుడ్ లో లింగుస్వామికి మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తరువాత రామ్ .. గోపీచంద్ మలినేని ప్రాజెక్టు ఉండొచ్చని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘పండగ చేస్కో’ సూపర్ హిట్ గా  నిలిచింది. అందువలన కచ్చితంగా ఇది క్రేజీ కాంబినేషనే అవుతుంది. అయితే అధికారిక ప్రకటన వస్తేనేగానీ ఈ విషయాన్ని నమ్మలేం.

ఇటీవల ‘క్రాక్’ సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసిన గోపీచంద్ మలినేని తన తాజా చిత్రాన్ని బాలయ్యతో ప్లాన్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఈ కథ నడుస్తుంది. బాలయ్య అభిమానులు ఆయన నుంచి ఆశించే పవర్ఫుల్ డైలాగులు … మాస్ డాన్సులు .. ఫైట్లు పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ‘సంక్రాంతి’ బరిలోకి ఈ సినిమాను దింపే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here