క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంటున్న సాయిపల్లవి!

0
25

హీరోయిన్లు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టునేవాళ్లు మొదటి టైపు. ఏ ఇండస్ట్రీలోనైనా వీళ్లే మెజారిటీగా ఉంటారు. వీళ్ల దృష్టి మొత్తం బ్యాంక్ బ్యాలన్స్ పెంచుకోవడం మీదనే ఉంటుంది. అందుకే.. ఎలాంటి సినిమా ఛాన్స్ వచ్చినా పచ్చజెండా ఊపేస్తారు.

ఇక రెండో టైపు వాళ్లు ప్లాన్డ్ గా పర్ఫెక్ట్ గా ఉంటారు. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటారు. రెమ్యునరేషన్ అనేది సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ వాళ్లకు క్యారెక్టర్ ఇంపార్టెంట్. సినిమాలో తమ పాత్ర నచ్చితేనే ఓకే చెబుతారు. తమ రోల్ వ్యాసార్థం ఎంత? వెయిటేజీ ఎంత? అని లెక్కలు వేసుకున్న తర్వాతనే సైన్ చేస్తారు. రూపాయి తక్కువైనా పర్లేదుగానీ.. క్యారెక్టర్ మాత్రం తగ్గొద్దనే ఫిలాసఫీ వీళ్లది. ఇలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి.

ఆ మధ్య ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ కు కోటి రూపాయలు ఇస్తానంటే నిర్మొహమాటంగా నో చెప్పిందీ బ్యూటీ. అబద్దాలు ప్రచారం చేయడం తనకు ఇష్టం లేదని కూడా చెప్పిందట. ఇలా ఒకటీ రెండు కాదు.. దాదాపు 6 కమర్షియల్ యాడ్స్ కు రెడ్ సిగ్నల్ చూపించిందట.

ఇక పలు సినిమాల విషయంలోనూ ఇదే చేసింది. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’లో మొదట సాయి పల్లవినే అనుకున్నారట. కానీ.. క్యారెక్టర్ డిమాండ్ చేయకపోవడంతో డీల్ క్యాన్సిల్ చేసిందట కేరళ కుట్టి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ ఛాయిస్ కూడా ఈ అమ్మడేనట. పాత్ర నచ్చకపోవడంతో.. తాను పరకాయ ప్రవేశం చేయలేనని చెప్పేసిందట.

ఇవేకాదు.. ఇంకా ఉన్నాయి. పవర్ స్టార్ – రానా చిత్రంలోనూ సాయి పల్లవినే అనుకున్నారు. బెల్లకొండ సాయి శ్రీనివాస్ కాదన్ రీమేక్ లోనూ ఈ బ్యూటీనే బుక్ చేద్దామనుకున్నారు. కానీ.. రోల్ నచ్చకపోవడంతోనే రిజెక్ట్ చేసిందని టాక్. ప్రస్తుతం సినిమాకు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు తీసుకుంటోందీ బ్యూటీ. ఆ లెక్కన సినిమాల నుంచి ఓ ఐదు కోట్లు.. యాడ్స్ నుంచి ఐదు కోట్లు.. మొత్తం పది కోట్లు వదిలేసుకుందట నేచురల్ బ్యూటీ. క్యారెక్టర్ ఇంపార్టెంట్ అయిన వాళ్లకు డబ్బుదేముందీ..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here