కోవై సరళ.. ఇన్నేళ్లయినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే.. త్యాగం చేయక తప్పలేదు

0
5

కమెడియన్స్ ఎంతోమంది వస్తుంటారు కనుమరుగై పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసులో బలంగా పాతుకుపోతారు. ఇక అలాంటి అల్లరి నటులలో లేడి కమెడియన్ కోవై సరళ కూడా ఉన్నారు. ఆమె ఎలాంటి పాత్ర చేసినా కూడా జనాలు చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఇక వెండితెరపై నవ్వించే ఆ నటి జీవితంలో కన్నీళ్లు కష్టాలు కూడా ఎదురయ్యాయి. ఇక ఆమె ఇన్నేళ్లయినా పెళ్లి చేసుకోకపోవటానికి ఒక కారణం కూడా ఉందట.

దాదాపు స్టార్ హీరోలందరితో

కామెడీ టైమింగ్ ఉన్న అతికొద్ది మంది లేడి కమెడియన్స్ లలో కోవై సరళ ఒకరు. తమిళ్ తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు. హీరో అయినా సరే విలన్ అయినా సరే తన పక్కన ఎవరు నటించినా కూడా ఒక ఆటాడుకుంటు వెండితెరపై అద్భుతమైన కామెడీని పండిస్తారు.

ఏ భాషలో సినిమా చేసినా

కోవై సరళ చూడడానికి కొంచెం చైనా మహిళలా ఉంటుంది. కానీ ఆమె చెన్నైకి చెందినవారు. ఇక ఏ భాషలో సినిమా చేసినా కూడా వీలైనంత వరకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక తెలుగు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. చిన్న సినిమా చేసినా కూడా తనే సొంతంగా డబ్బింగ్ చెప్పేవారు.

అదే మేజర్ ప్లస్ పాయింట్

మొదట్లో ఆమె వాయిస్ చూసి అందరూ నెగిటివ్ గా కామెంట్స్ చేసేవారట. కానీ సినిమాలకు అదే మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది. కోవై సరళ డైలాగ్ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. నువ్వే కావాలి, దేశముదురు, కాంచన వంటి సినిమాల్లో ఆమె కామెడీకి మంచి క్రేజ్ దక్కింది.

800కు పైగా చిత్రాల్లో

ముఖ్యంగా కోవై సరళ బ్రహ్మానందం కామెడీ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వారి కాంబినేషన్ కు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె 800కు పైగా చిత్రాల్లో నటించారు. పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఏడాదిలో 365రోజులు బిజీ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు.

పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే

ఇక కోవై సరళ వయసు ప్రస్తుతం 59 సంవత్సరాలు. ఇన్నేళ్లయినా ఆమె పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నారు అనేది చాలామందికి తెలియదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో నలుగురు చెల్లెళ్ళ జీవితాన్ని తనే చూసుకుందట. వారికి పెళ్లిళ్లు చేసి పిల్లల బాధ్యతను కూడా చూసుకుంటోందట. ఆ లైఫ్ లో బిజీ అవ్వడం వలన తన జీవితాన్ని కూడా త్యాగం చేయాల్సివచ్చింది. ఇక పిల్లలకు మంచి విద్యను అంధించి ఒక గొప్ప స్థాయికి తీసుకురావాడమే తన జీవిత లక్ష్యమని కోవై సరళ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here