కోవిడ్ వాక్సిన్ వేయించుకున్న సూపర్ స్టార్..!

0
16

ప్రస్తుతం దేశంతో పాటుగా సినీ ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. రోజురోజుకి పెరుగుతోంది కూడా. ఇలాంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు కరోనా వాక్సిన్స్ తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కొంతకాలంగా వాక్సిన్స్ ప్రాసెస్ కూడా నడుస్తూనే ఉంది. అయితే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది వరకు వాక్సినేషన్ చేయించుకున్నారు. కానీ ఇంతవరకు వాక్సిన్ తీసుకొని వారు మెల్లగా బయటకు వచ్చి వాక్సినేషన్ చేయించుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టులో సూపర్ స్టార్ తలైవా చేరారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని స్వగృహంలో కోవిడ్ వాక్సినేషన్ చేయించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కావాల్సిన ఈ కోవిడ్ టీకా సూపర్ స్టార్ తీసుకొని ఆయన అభిమానులకు కూడా తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తమిళ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సూపర్ స్టార్ తలైవార్ సినిమాలపరంగా ప్రస్తుతం అన్నాతే అనే సినిమా చేస్తున్నారు.

వివేగం – వేదాలం – విశ్వాసం ఫేమ్ శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే షూటింగ్ దశలో ఉన్న అన్నాతే మూవీ ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోవడం కారణంగా ఆగింది. ఈ ఏడాది దీవాలికి విడుదల చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించడం జరిగింది. తలైవా చివరిసారిగా తెరపై కనిపించింది దర్బార్ సినిమాలోనే.. గతేడాది సంక్రాంతి బరిలో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకుంది. ఇక అన్నాతే సినిమాలో హీరోయిన్స్ గా ఖుష్బు – మీనా – కీర్తిసురేష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ కమల్ హాసన్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here