కోట్లు సంపాదించా, నా వరకు సరిపడ దాచుకున్నా.. సోషల్ మీడియా కథనాలపై ఆర్.నారాయణమూర్తి ఆవేదన

0
12

పీపుల్స్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ఆర్.నారాయణమూర్తి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక సామాజిక అంశం ఉండాలని అంటారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సిద్ధాంతానికి కట్టుబడి ఉండే ఏకైక వ్యక్తి అని చెప్పవచ్చు. ఇక జనాల్లో ఆయనకు ఉండే అభిమానం చాలా ఆత్మీయతతో ఉంటుంది. అయితే ఇటీవల ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నానని గద్దర్ చెప్పిన మాటలను సోషల్ మీడియాలో వక్రీకరించారని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

దైర్యంగా ప్రశ్నిస్తూ..

కేవలం సినిమాలతోనే కాకుండా ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఆర్.నారాయణమూర్తి పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల రైతులతో కలసి ర్యాలీలో పాల్గొనడంతో అరెస్టుకు కూడా గురయ్యారు. ఎలాంటి సమస్యల పైన అయినా సరే ఎర్రన్న ధైర్యంగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు.

ఎర్రన్న ఆర్థిక పరిస్థితులపై గద్దర్ కామెంట్

ఇక ఇటీవల రైతన్న అనే సినిమాను డైరెక్ట్ చేసి నటించిన ఆర్ నారాయణమూర్తి రెగ్యులర్ ప్రమోషన్ ను స్టార్ట్ చేశారు. గ్లోబలైజేషన్‌లో రైతులు పడుతున్న అవస్థల గురించి వెల్లడిస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌లో ముఖ్య అతిథిగా హాజరైన గద్దర్.. ఎర్రన్న ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడారు.

ఇంటి అద్దె కట్టలేని స్థితిలో

ఇక సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలను ఖండించిన పీపుల్స్ స్టార్.. కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నాడంటూ గద్దర్ చెప్పిన మాటలను వక్రీకరించారని, దానిపై వచ్చిన కథనాలు కొంత మనోవేదనకు గురి చేశాయని ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

నా మనసుకు బాధ కలిగించింది

పల్లెటూరి వాతావరణంలో గడపడం ఇష్టం కాబట్టే సిటికి దూరంగా ఉంటున్నానని చెబుతూ.. ఆటోలో రాకపోకలకే నెలకు రూ.30 వేలు ఖర్చవుతాయి. అలాంటిది ఒక ఇంటి అద్దె కట్టుకోలేనా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు రాయడం వల్ల నా మనసుకు బాధ కలిగించిందని పీపుల్స్ స్టార్ కామెంట్ చేశారు.

ఆ మాటలకు కన్నీళ్లు వస్తున్నాయి

ఇక ఆ వార్తలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆర్థిక సహాయం చేస్తామని తనకు ఫోన్ కూడా చేస్తున్నారని అయితే ఆ మాటలకు కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు. కోట్లు సంపాదించా, నా వరకు సరిపడ దాచుకున్నా, మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చాను అంటూ ఆర్.నారాయణమూర్తి మాట్లాడారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here