కొన్ని గంటల్లో వివాహం.. పెళ్లి చేసుకుంటే బతుకు బస్టాండే అంటోన్న నితిన్

0
47

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కాసేపట్లో ఓ ఇంటి వాడు కాబోతోన్నాడు. నేటి రాత్రి ప్రేయసి షాలిని మెడలో మూడు ముళ్లు వేసి బ్యాచ్‌లర్ లైఫ్‌కు పుల్ స్టాప్ పెట్టబోతోన్నాడు. ఇలాంటి టైమ్‌లో పెళ్లి చేసుకుంటే నితిన్ ఫ్యూచర్ ఏంటో రంగ్ దే టీమ్ పరోక్షంగా తెలిపింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే చిత్రం నుంచి నితిన్ పెళ్లి కానుకగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. దాంట్లో నితిన్ భవిష్యత్తు కనిపిస్తోంది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి? అందులో ఏముందో ఓసారి చూద్దాం.

అట్టహాసంగా పెళ్లి..
మామూలుగా నితిన్ షాలినిలా పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్‌లో భాగంగా దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరగాల్సింది. కానీ కరోనా వైరస్ విజృంభణ అన్నీ తలకిందులు అయ్యాయి. ఇక వేచి చూసి హైద్రాబాద్‌లోనే కానిచ్చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఫలక్ నుమా ప్యాలెస్‌లో నితిన్ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది.

పెళ్లి తంతు వేడుకలు..
నితిన్ పెళ్లి తంతు వేడుకులకు సంబంధించిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి కొడుకు ఫంక్షన్, మెహిందీ వేడుకలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. పెళ్లి కొడుకు ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ రావడం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.

మ్యారేజ్ గిఫ్ట్..
అయితే రంగ్ దే టీమ్ మాత్రం నితిన్‌కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయింది. అది కూడా వివాహానికి కొన్ని గంటల ముందే. అందుకే నితిన్ పెళ్లి పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. అతనితో డబ్బింగ్ చెప్పించుకుని ఓ గిఫ్ట్‌ను రెడీ చేశారు. తాజాగా ఆ గిఫ్ట్‌ను రిలీజ్ చేశారు.

బతుకు బస్టాండ్..
రంగ్ దే సినిమా నుంచి ఓ టీజర్‌ను నితిన్ మ్యారెజ్‌ గిఫ్ట్‌గా రిలీజ్ చేశారు. ఇందులో కీర్తి సురేష్, నితిన్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. అది నా లవర్ కాదు విలన్లతో చెప్పడం, రిజిష్టర్ మ్యారెజ్ సీన్, తాళి కట్టే సీన్ అదిరిపోయింది. కరెక్ట్ సిట్యువేషన్‌కు తగ్గట్టుగా ఉంది. కీర్తి సురేష్ నవ్వుతూ ఉండటం.. నితిన్ ఏడుస్తూ తాళి కట్టడం ఫుల్ ఫన్నీగా ఉంది. ఇక పెళ్లి అనంతరం బట్టలు ఉతకడం, ఇంటి పనులు చేయడం, అంట్లు తోమడం వంటివి చేస్తూ పెళ్లి చేసుకుంటే బతుకు బస్టాండే అని పరోక్షంగా చెప్పాడు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here