కొడుకు కండోమ్ ప్రకటనపై తండ్రి రియాక్షన్

0
12

బాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా విలక్షణమైన ఆహార్యం ఉన్న ప్రతిభావంతుడిగా రణవీర్ సింగ్ కి గుర్తింపు ఉంది. అతడి ఎనర్జీ లెవల్స్ ని వేరొక హీరో అందుకోలేడు..! అన్నంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అతడి ఫ్యాషన్ ఎంపికలపైనా యువతరం నిరంతరం ఆసక్తికరంగా ముచ్చటించుకుంటుంది. ఇటీవలే అతడు హిజ్రా లుక్ లో ప్రత్యక్షమై ఇంటర్నెట్ లో సరికొత్త డిబేట్ కి కారణమయ్యాడు. ఇప్పటికీ ఆ ఫోటోలు అంతర్జాంలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా రణవీర్ సింగ్ ఓ బోల్డ్ విషయాన్ని బహిరంగంగా మాట్లాడి సర్ ప్రైజ్ చేశాడు. రణవీర్ సింగ్ తండ్రి తన కండోమ్ ప్రకటనపై ఏమని స్పందించారంటే..!రణ్వీర్ సింగ్ ప్రస్తుతం కెరీర్ ఉత్తమ ఫేజ్ లో ఉన్నా ఒకప్పుడు డెబ్యూ నటుడే. ప్రస్తుతం అతడు బాలీవుడ్ లో సక్సెస్ లో ఉన్న హీరో.. అయితే రణవీర్ ని కెరీర్ ఆరంభం అసలు ఏం పని చేస్తున్నాడో .. అని అతని తండ్రి అడిగిన సందర్భాలున్నాయి.

ఇతర నటీనటుల మాదిరిగా ప్రతిదీ అంగీకరించవద్దని రణవీర్ తండ్రి చెప్పేవారట. సరైన సమయం వచ్చినప్పుడు..! అంటూ రణవీర్ స్పందించేవాడు. ఓసారి అతను కండోమ్ ప్రకటనకు ఓకే చెప్పాడు. దాని గురించి రణవీర్ తన తండ్రికి తెలియజేసినప్పుడు “నిజంగా?  నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందని నేను నమ్ముతున్నాను“ అని అన్నారట.
 
రణ్వీర్ పెద్ద తెరపై తనదైన విలక్షణత చమత్కారమైన శైలికి ప్రసిద్ది చెందాక… అతను తన అభిమానులను రంజింపచేయడంలో ఎప్పుడూ విఫలం కాదు.  తరచూ తన అభిమానులతో సంభాషించడం .. సోషల్ మీడియాలో తన పోస్టుల ద్వారా వారిని అలరించడం ద్వారా భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే… కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో రణవీర్ నటిస్తున్నాడు. తదుపరి సిర్కస్ కోసం తన ‘సింబా’ దర్శకుడు రోహిత్ శెట్టితో తిరిగి కలుస్తాడు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్- పూజా హెగ్డే- వరుణ్ శర్మ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఇవే కాకుండా విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘అన్నియన్’ అనే తమిళ చిత్రం అధికారిక హిందీ రీమేక్ కోసం రణ్వీర్ రెడీ అవుతున్నాడు. కియారా అద్వానీ ఇందులో నాయిక.

రణ్వీర్ ప్రస్తుతం కబీర్ ఖాన్ ’83’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో కపిల్ దేవ్ పాత్రను అతడు పోషించాడు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే తెరపై భార్య రోమి దేవ్ పాత్రలో నటించారు.  దీపిక ఈ చిత్రానికి సహనిర్మాతానూ పెట్టుబడులు సమకూర్చారు.

రణవీర్ ఆస్టన్ మార్టిన్ అదరహో:

రణవీర్ సింగ్ శుక్రవారం తన ఆస్టన్ మార్టిన్ కారును నడుపుతూ ముంబై వీధుల్లో ప్రత్యక్షమయ్యారు. అయితే ఈ కారు గతంలో చూసిన వైట్ షాడో కలర్ కి బదులుగా ఆక్వా బ్లూ రంగులో కనిపించింది. రణ్ వీర్ బూడిద రంగు టోపీ-ఫేస్ మాస్క్ – సన్ గ్లాసెస్తో కనిపించాడు. రణవీర్ సింగ్ తన కారులోకి వెళ్లి ఒక భారీ భవంతి నుండి నిష్క్రమించేప్పుడు కెమెరా కంటికి చిక్కాడు. రణ్ వీర్ తన 32 వ పుట్టినరోజున 2017 లో ఆస్టన్ మార్టిన్ ను సెల్ఫ్ గిఫ్ట్ గా ఇచ్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here