కేటీఆర్ ను కలిసిన నేషనల్ హీరో..!

0
14

కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తూ తన మంచి మనసు చాటుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. సినిమాల్లో విలన్ గా నటించిన సోనూ.. సేవాగుణంలో రియల్ హీరో అనిపించుకున్నాడు. తన ఫౌండేషన్ ద్వారా కోరిన వారికి అపరిమితమైన సాయం చేస్తున్న నేషనల్ హీరో సోనూ.. ఈరోజు మంగళవారం తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడిన కేటీఆర్.. ఆయన్ను శాలువాతో సత్కరించి ఒక మొమొంటో ను అందజేశారు. ఈ క్రమంలో సోనూ చేస్తున్న మరిన్ని కార్యక్రమాల గురించి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోనూసూద్ తో పాటుగా టాలీవుడ్ దర్శకులు మెహర్ రమేష్ – వంశీ పైడిపల్లి కూడా కేటీఆర్ ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.

తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల ప్రణాళిక గురించి సోను సూద్ – వంశీ పైడిపల్లి – మెహర్ రమేష్ లకు మంత్రి కెటిఆర్ వివరించారు. సోనూ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని మంత్రి అన్నారు. తన తల్లి స్పూర్తితో ఈ సేవా కార్యక్రమాలు చెప్పిన సోనూసూద్.. ఈ సందర్భంగా హైదరాబాద్ పట్ల ఇక్కడి వారి పట్ల అనుబంధం ఉందని చెప్పారు. కేటీఆర్ అంటే ప్రత్యేకమైన గౌరవం ఉందని అన్నారు. ఈ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ సినీ ప్రముఖులకు లంచ్ ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here