కెరీర్ కోసమే ప్రేయసిని వదులుకున్న సుశాంత్ సింగ్

0
26

సుశాంత్ తన అభిమాన సహనటుడు అని అతడి మాజీ ప్రేయసి అంకితా లోఖండే తెలిపారు. విత్ర రిష్టా అనే సీరియల్ లో సుశాంత్-లోఖండే కలిసి జంటగా నటించిన సంగతి తెలిసిందే. 2016 వరకూ కొనసాగిన సీరియల్ ఇది.

అంకితా లోఖండే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిమాన సహనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2016వరకూ కలిసి పని చేసానని.. అతను గత సంవత్సరం బలవన్మరణం చెందారని అన్నారు. ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోందని గుర్తు చేశారు.

ఇటీవలి ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్ లో అంకిత.. సుశాంత్ మరణించినప్పటి నుంచి తనపై చూపిన ప్రతికూలతను ఖండించారు. అభిమానులకు మా గతం గురించి అస్సలు ఏమీ తెలియదు. సుశాంత్ తన కెరీర్ పై దృష్టి పెట్టాలని కోరుకున్నందున విడిపోయామని అంకిత అన్నారు. ఆమె మాట్లాడుతూ .. సుశాంత్ ఎప్పుడూ తన జీవితంలో ఎదగాలని కోరుకుంటాడు. అతను అదే చేశాడు. నా కథ ఏమిటో మీకు తెలియదు.. కాబట్టి నన్ను నిందించడం మానేయండి. ఇది నిజంగా బాధ కలిగించేది.. అని అన్నారు.

తన భాగస్వామిలో అసహ్యించుకునే విషయం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానంగా.. అతడు ఒక స్నేహితుడిగా ఉండాలి. నిజాయితీని ఆరాధిస్తాను.. తరచూ భావోద్వేగాలు నన్ను మెరుగుపరుచాలనుకుంటాను అని ఆమె అన్నారు.

రిలేషన్ షిప్ లో నచ్చనిది ఏది? అంటే అపరిమిత అబద్ధాలు అని అంకిత తెలిపారు. మీరు నన్ను ఇష్టపడకపోతే లేదా  నాతో నిజాయితీగా ఉండండి. లేదంటే నేను చాలా ప్రభావితమవుతాను. ఎవరైనా అబద్ధం చెబితే. నేను సూటిగా గుచ్చేసే బాణాన్ని.  కాబట్టి మీరు నాతో అబద్ధం చెబితే నేను దర్యాప్తు చేసి తెలుసుకుంటాను అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here