కెరటాల్ని ఆపలేవు కానీ ఈదగలవు!

0
13

అందాల కథానాయిక కియరా అద్వాణీ సోషల్ మీడియాల్లో ఎంత స్పీడ్ గా ఉంటుందో చూస్తున్నదే. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఇన్ స్టాలో ఫాలోవర్స్ ని పెంచుకోవడంలోనూ కియరా తర్వాతే.

ఇంతకుముందు మాల్దీవుల విహారం నుంచి అద్భుతమైన బికినీ ఫోటోలను షేర్ చేయగా అవి అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తాజాగా కియరా సముద్రంలో నీటి అడుగున స్విమ్ చేస్తున్న ఓ ఫోటోని షేర్ చేయగా అది అంతర్జాలంలో వైరల్ గా మారింది. కియరా మత్స్యకన్యలా మారి ఈదుతున్న తీరు ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ ఫోటోకి తెలుగు పాపులర్ యాంకర్ విష్ణుప్రియ `హార్ట్` ఈమోజీని షేర్ చేసారు.

కెరటాల్ని ఆపలేవు కానీ ఈదడం ఎలాగో నేర్చుకోగలవు! అంటూ దీనికి క్యాప్షన్ ని ఇచ్చింది కియరా. సముద్రంలో అయినా జీవితంలో అయినా ఈదడమెలానో తెలిసిన భామ కాబట్టే కెరీర్ పరంగా ఎదురే లేకుండా దూసుకుపోతోంది. కెరీర్ మ్యాటర్ కి వస్తే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన `షెర్షా` లో కనిపిస్తుంది. ఈ చిత్రం జూలై 2 న విడుదల కానుంది. వరుణ్ ధావన్- అనిల్ కపూర్- నీతు కపూర్ లతో `జగ్ జగ్ జీయో`లోనూ కియరా నటిస్తోంది. భూల్ భులయ్యా చిత్రంలోనూ కియరా కథానాయిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here