కృష్ణపట్నం పోర్ట్ లో `ఏజెంట్` రహస్యాలు

0
17

అక్కినేని వారసుడు అఖిల్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రీకరణ పూర్తయి రిలీజ్ కు రెడీ గా ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` సెట్స్ పై ఉంది. ఈ రెండు చిత్రాలతో హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా  చాటాలని అఖిల్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటివరకూ అఖిల్ కెరీర్ కు సరైన సక్సెస్ లేకపోవడంతో ఈ రెండు చిత్రాలపై భారీగా ఆశలు పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు. బాక్సాఫీస్ షేకయ్యేలా భారీ విజయాలు అందుకుని టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని సీరియస్ గా ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.

అన్ లాక్ ప్రక్రియలో తాజాగా `ఏజెంట్` తిరిగి  సెట్స్ కు వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా సెకెండ్ వేవ్ తగ్గు ముఖం పట్టడంతో ఆగిపోయిన సినిమాలు తిరిగి షూటింగ్ లను ప్రారంభిస్తున్నారు. ఇదే దారిలో ఏజెంట్ కూడా చిత్రీకరణకు రెడీ అవుతోంది. తదుపరి షెడ్యూల్ లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ లో అఖిల్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించడానికి రెడీ  అవుతున్నారు. ఇప్పటికే అక్కడ కొన్ని సన్నివేశాల్ని షూట్ చేసారు.  తాజాగా మిగిలిన సీన్స్ షూట్ చేసి తిరిగి హైదరాబాద్ రానున్నారు. అనంతరం రాజధాని నగరంలోనే మరో కీలక షెడ్యూల్  చేయనున్నారు.

ఇందులో అఖిల్ స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఇది ముంబై బేస్ట్ క్రైమ్  స్టోరీ. అఖిల్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని..అతడి పెర్పామెన్స్ లో కొత్త కోణం కనిపించనుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మరి స్పై పాత్రలో అఖిల్ ని దర్శకుడు ఎలా ఆవిష్కరిస్తారన్నది చూడాలి. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య నాయికగా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన `సైరా నరసింహారెడ్డి` తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here