కుర్రకారులో హీట్ పెంచుతున్న రష్మిక..!

0
24

తెలుగు చిత్రపరిశ్రమలో కన్నడ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ప్రస్తుతం అమ్మడు టాలీవుడ్ – బాలీవుడ్ వరకు యూత్ మొత్తానికి క్రష్ గా మారిపోయింది. తెలుగులో ఛలో సినిమాతో అరంగేట్రం చేసిన ఈ ‘కిరాక్ పార్టీ’ బ్యూటీ.. డెబ్యూ మూవీతోనే మంచి వినోదాత్మకమైన హిట్ అందుకుంది. ఆ సినిమాలో చూసి చూడంగానే నచ్చేసావే.. అనే పాటతో కుర్రకారుకు బాగా కనెక్ట్ అయిపోయింది. అప్పటినుండి రష్మిక ఫాలోయింగ్ భీభత్సంగా వెనకేసుకుంది. తాను చేసే ప్రతి సినిమాలో క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ కుర్రకారుకి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే అమ్మడిని అంతలా ఫాలో అవుతున్నారు ఫ్యాన్స్.

ఛలో అనంతరం.. వరుసగా గీతగోవిందం – సరిలేరు నీకెవ్వరూ – భీష్మా లాంటి మంచి విజయాలు ఖాతాలో పడేసరికి రష్మిక ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. అలాగే సినిమాలపరంగా భారీ డిమాండ్ కూడా పెరిగిపోయింది. గతేడాది మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు నితిన్ తో భీష్మా సినిమాలతో పాటు ఈ ఏడాది కార్తీ సరసన సుల్తాన్ సినిమాతో భారీ విజయాలను ఖాతాలో వేసుకుంది. చూస్తుంటే త్వరలోనే సౌత్ ఇండస్ట్రీలను షేక్ చేసేలా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. అదృష్టం ఏంటో గాని రష్మికకు కెరీర్ ప్రారంభం నుండి తెలుగులో హిట్స్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది.

అయితే అప్పుడప్పుడు అమ్మడు సినిమాలే కాకుండా గ్లామర్ షో కూడా చేస్తుంటుంది. మరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు కదా.. వారికోసమైనా అప్పుడప్పుడు రష్మిక హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తుంటుంది. మిలియన్స్ లో ఫాలోయింగ్ కలిగి ఉంది కాబట్టి.. అమ్మడు ఏ పిక్ పెట్టినా నిముషాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా అమ్మడి త్రోబ్యాక్ పిక్స్ ఇంస్టాగ్రామ్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈ లేతసోయగం వర్కౌట్ డ్రెస్ లో దిగిన క్యూట్ అండ్ హాట్ అందాలు చూస్తూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పాతికేళ్లు నిండిన లేతహొయలు కుర్రగుండెలను మీటుతున్నాయని నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వయ్యారి నడుము నాభి అందాలు హైలైట్ అవుతున్నాయి. అమ్మడు ప్రెసెంట్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here