కళ్ల ముందే హీరోయిన్ సోదరుని చావు.. సామాన్యుడి పరిస్థితేంటి?

0
32

కళ్ల ముందే చావులు.. కరోనాతో విలవిలలాడుతూ ఊపిరందక మరణాలు కలచివేస్తున్నాయి. చాలామందికి ఆస్పత్రిలో బెడ్లు లేక.. వెంటిలేటర్లు చాలక.. ఆక్సిజన్ అందక మరణాలు సంభవిస్తున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు చూపరులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇలాంటి ధైన్యం ఊహించనిది. సెకండ్ వేవ్ ఎక్కువమందిని బలి కోరుతోంది.

తాజాగా రంగం కథానాయిక పియా భాజ్ పాయ్ అరణ్య రోదన తెలుగు ఫిలింసర్కిల్స్ లోనూ చర్చకు వచ్చింది. కళ్ల ముందే తన సోదరుడు వెంటిలేటర్ సాయం అందక ఊపిరాడని పరిస్థితి ఉంటే తనకు ఎలాగైనా సాయం చేయాలని అభ్యర్థిస్తూ ఆస్పత్రి ఎదుట కనిపించింది. తన సోదరుడికి సాయం చేయాల్సిందిగా పియా సోషల్ మీడియాల్లో అభ్యర్థించింది. తన సోదరుడిని కాపాడుకోవాడనికి తన శక్తి మేరకు ప్రయత్నాలు చేసింది. కానీ ఫలితం దక్కలేదు.

పియా బాజ్పాయ్ సోదరుడు ఇటీవల కోవిడ్ సోకింది. మంగళవారం ఉదయం పరిస్థితి విషమంగా మారడంతో హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. బెడ్ లేదు.. వెంటిలేటర్ లేదు. దీంతో వేకువఝాము 6 గం.ల నుంచి ఆస్పత్రి వద్దనే రోధించారు. ఇది అరణ్య రోదన. తన సోదరుడు కొన ఊపిరితో ఉన్నాడని ఎంతగానో అభ్యర్ధించిస్తే నియోజకవర్గ ఎమ్మెల్యేని ట్యాగ్ చేస్తే ఎవరూ స్పందించలేదు. ఒక వ్యక్తి స్పందించినప్పటికి సరైన ప్రయోజనం లేకపోయింది. తాను ఫలానా ఆస్పత్రిలో ఫలానా బ్లాక్ లో ఉన్నానని పియా వెల్లడించింది. చివరికి తన తమ్ముడు చనిపోయాడని తీవ్ర దుఃఖంతో సోషల్ మీడియాల్లో వెల్లడించింది. ఆమె ట్వీట్లు నెటిజనుల్ని కలచివేశాయి. కానీ ఎవరూ సాయం చేయలేకపోయారు.

ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల సంగతేంటి? అన్నది అయోమయంగా మారింది. ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ఎవరికి వారు సైలెంటుగా ఉన్నారు. డాక్టర్లు ఏమి చేయలేని ధైన్యం. ఈ పరిస్థితిలో ఎవరికి వారు స్వీయ నిబంధనల్ని కఠినంగా అమలు చేయకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని పరిస్థితులు ప్రూవ్ చేస్తున్నాయి. శ్మశానాలకు హౌస్ ఫుల్ బోర్డ్ వేస్తున్నారంటే ఎంతటి దారుణమో అర్థం చేసుకోవాలి. స్టే హోమ్.. స్టే సేఫ్.. ఒక్కటే మార్గం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here