కరోనా బ్రేక్ తో భార్యతో దిల్ రాజు షికారు

0
34

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇటీవల కాలంలో వరుసగా సినిమాలను నిర్మిస్తున్నాడు. ఆయన బ్యానర్ లో చిన్నా పెద్ద సినిమాలు కలిపి ఒకేసారి నాలుగు అయిదు సినిమాలు నిర్మాణం అవుతున్నాయి. ఇటీవలే దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకు వెళ్తున్న సమయంలో అనూహ్యంగా కరోనా సెకండ్ వేవ్ వల్ల కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. దాంతో అమెజాన్ ప్రైమ్ లో సినిమా స్ట్రీమింగ్ కు ముందస్తు అనుమతి ఇచ్చి మరింత మొత్తంను దక్కించుకున్నాడు.

కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ లు దాదాపు అన్ని ఆగిపోయాయి. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న సినిమాలన్నీ కూడా షూటింగ్ లకు బ్రేక్ పడింది. దాంతో భార్య వైఘ్య రెడ్డితో కలిసి అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఇండియా నుండి అమెరికాకు వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు ఉన్నాయి. అయినా కూడా దిల్ రాజు ప్రత్యేక అనుమతులు తీసుకుని మరీ అమెరికా వెళ్లారు. గత ఏడాది పెళ్లి చేసుకున్న దిల్ రాజు మరియు వైఘ్య రెడ్డి లు కరోనా కారణంగా లాంగ్ ట్రావెల్ చేసింది లేదు. ప్రస్తుతం షూటింగ్ లు ఏమీ లేకపోవడంతో పాటు ఇండియాలో కరోనా పరిస్థితులు మరీ ఆందోళనకరంగా ఉన్న కారణంగా అమెరికాకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

దిల్ రాజు బ్యానర్ లో ప్రస్తుతం పలు సినిమాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఒకటి రెండు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇక దిల్ రాజు ఒకటి రెండు పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నాడు. థియేటర్లు ప్రారంభం అయితే  మళ్లీ దిల్ రాజు బిజీ అవుతారు. అందుకే భార్యతో కలిసి యూఎస్ లో మూడు నుండి నాలుగు వారాల పాటు గడిపేందుకు వెళ్లినట్లుగా సమాచారం అందుతోంది. ఎప్పుడు బిజీగా ఉండే దిల్ రాజు కాస్త రిలాక్స్ ను కోరుకుని యూఎస్ వెళ్లారని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here