కరోనా బాధితులకోసం స్టార్ హీరోయిన్ కృషి..!

0
20

ప్రస్తుతం దేశంలో కరోనా బారినపడి అవస్థలు పడుతున్న బాధితులకు సహాయం చేయడానికి సెలబ్రిటీలు తమవంతు ప్రయత్నంగా ముందుకు వస్తున్నారు. దేశంలో రోజురోజుకి లక్షల్లో కరోనా కేసులు – వేలసంఖ్యలో కరోనా మరణాలు చూస్తూ జనాలు వణికిపోతున్నారు. ఇలాంటి తరుణంలో సౌత్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఇటీవలే కరోనా బారినుండి కోలుకుంది. అలాగే తాను కరోనా నుండి కోలుకుందో లేదో వెంటనే కరోనా బాధితులకు తన వంతు సాయం అందించాలని ఫండ్ రైసింగ్ ప్రోగ్రాం ప్రారంభించింది.

ఇప్పటికే ఆమె వంతుగా సేకరించిన నిధులతో బాధితులకు ఆక్సిజన్ సాంద్రతలు ఆక్సిజన్ సిలిండర్లు మరియు వాటి రీఫిల్లింగ్ కోసం సరిపడా ఫండ్స్ రైస్ చేయనున్నట్లు తెలిపింది. కరోనా నుండి ప్రాణాలను రక్షించే పరికరాలను అందించడానికి కూడా రకుల్ తన టీమ్ తో కలిసి కృషి చేస్తోంది. తాజాగా రకుల్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం మన దేశం పరిస్థితి చూస్తే బాధగా ఉంది. ఆక్సిజన్ బెడ్స్ మందులు మరియు మరెన్నో కొరతల కారణంగా అవస్థలు పడుతున్న సామాన్యులను ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం.

అయితే  ‘గివ్ ఇండియా’ పేరుతో ఫండ్ రైసింగ్ చేస్తూ.. బాధితులకు ఆక్సిజన్ – లైవ్ సేవింగ్ పరికరాలు అందించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం” అని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అదేవిధంగా రకుల్ జనాలు కూడా ఫండ్ రైసింగ్ విషయంలో పాల్గొనాలని ఆమె కోరింది. మేం అడుగుతున్నది 100/- రూపాయలు మాత్రమే. మీకు నచ్చితే ఎంతైనా ఇవ్వచ్చు. అయితే వంద రూపాయలు ఇచ్చినా సరే మీ సహాయం ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి మేం నిస్సహాయంగా ఉండే సమయంలో మీరు కూడా ఫండ్స్ రైస్ చేయాలనీ రకుల్ కోరింది. ప్రస్తుతం రకుల్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here