కరోనాతో మృతిచెందిన కీబోర్డ్ ప్లేయర్.. తమన్ సహాయం..!

0
29

టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఎందుకంటే కేసులు ఏ విధంగా పెరుగుతున్నాయో మరణాల సంఖ్య కూడా అదేవిధంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులతో పాటు నటులు – కార్మికులు కరోనా బారినపడి మృతి చెందారు. తాజాగా ఆ లిస్టులో చేరారు ప్రముఖ కీబోర్డు ప్లేయర్ కమల్ కుమార్. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసిన కమల్ కుమార్ కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యారు. ఇంతలోనే ఇటీవలే ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో కొద్దిరోజులు పోరాడి ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.

నిజానికి కరోనా మహమ్మారి తీవ్రత పెరిగినప్పటి నుండి ఇండస్ట్రీ తరపున పలువురు సెలబ్రిటీలు ముందుకొచ్చి ఆర్థికంగా సహాయం చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే తాజాగా కరోనా సోకి మరణించిన కీబోర్డ్ ప్లేయర్ కమల్ కుమార్ కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించేందుకు ముందడుగు వేసాడు. కమల్ కుమార్ కొడుకు చదువుకు కావాల్సిన ఆర్థిక సహాయం తాను చేస్తానని బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి అసలే కరోనా సమయం.. ఇలాంటి సమయంలో ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా సాగుతున్నాయి బ్రతుకులు. కానీ అసలు కష్టకాలంలో సహాయం చేసినవాడే అసలైన మనిషి అంటుంటారు.

ప్రస్తుతం కమల్ కుమార్ కుటుంబానికి తమన్ సహాయం అందించి ఆపద్భాందవుడు అయిపోయాడు. మ్యూజిక్ ఫీల్డ్ కాబట్టి కమల్ కుమార్ కష్టాలు తమన్ కు బాగా తెలుసు. అందుకే ఈ విధంగా తనకు తోచిన విధంగా సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమన్ సోషల్ మీడియాలో రియల్ హీరో అయిపోతున్నాడు.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తమన్ ప్రస్తుతం ఓ రేంజి ఫామ్ లో ఉన్నాడు. వరుసగా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో పాటుగా భారీ సినిమాలను దక్కించుకుంటున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుకు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాతో పాటుగా అఖండ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం తమన్ సేవాదృక్పథం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here