కత్రినా కైఫ్కు యువ హీరో మ్యారేజ్ ప్రపోజల్.. సల్మాన్ ఖాన్ ముందే మాజీ ప్రేయసికి షాకింగ్గా!

0
12

బాలీవుడ్ ముద్దు గుమ్మ కత్రినా కైఫ్, యువ హీరో వికీ కౌశల్ మధ్య ప్రేమ వ్యవహారం ముదిరి పాకాన పడింది. వారిద్దరి డేటింగ్‌ దృష్టిలో పెట్టుకొని పలువురు సినీ ప్రముఖులు ఆటపట్టించడం తెలిసిందే. అయితే ఓ అవార్డు ఫంక్షన్‌లో నేరుగా కత్రినా కైఫ్‌కు ప్రపోజ్ చేస్తూ వికీ కౌశల్ ఏమన్నారంటే…

వికీ కౌశల్, కత్రినా కైఫ్ మధ్య డేటింగ్

యూరీ లాంటి యాక్షన్, దేశభక్తి లాంటి సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొన్న వికీ కౌశల్, కత్రినా కైఫ్ మధ్య డేటింగ్ వ్యవహారం బాలీవుడ్ మీడియాలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకొన్నది. ఒకరి ఇంట్లో మరొకరు ఉంటూ మీడియా కంటికి చిక్కారు. అయితే వారిద్దరు మాత్రం అధికారికంగా తమ రిలేషన్‌షిప్‌ను బయటకు వెల్లడించలేదు.

కత్రినాను ఆటపట్టించిన కరణ్ జోహర్

కానీ కత్రినా, వికీ కౌశల్ అఫైర్ విషయాన్ని సోనమ్ కపూర్ సోదరుడు, అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్ నోరు జారడంతో వారి డేటింగ్ విషయంపై క్లారిటీ వచ్చింది. ఇటీవల సూర్యవంశీ చిత్ర ప్రమోషన్స్‌లో కత్రీనాను దర్శకుడు కరణ్ జోహర్, అక్షయ్ కుమార్ ఆటపట్టించారు. కత్రినా ఇంట్లో మంగళ్ కౌశల్ పుష్కలంగా అంటూ పరోక్షంగా కామెంట్లు విసిరారు.

నాలాంటి యువకుడిని చూసి పెళ్లి చూసుకోవచ్చుగా

ఇక ప్రస్తుతం కత్రినా, వికీ కౌశల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్నది. అవార్డు ఫంక్షన్ వేదికపై వికీ కౌశల్ హోస్టింగ్ చేస్తుండగా.. కత్రినా కైఫ్ అవార్డు అందించడానికి వచ్చింది. అవార్డుల కార్యక్రమంలో ముందు వరుసలో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. ఈ సందర్భంగా వికీ కౌశల్ లాంటి మంచి యువకుడిని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా అంటూ కత్రినాను వికీ కౌశల్ ఉడికించాడు. దాంతో కత్రినా నవ్వుతూ ఉండగా.. సల్మాన్ ఖాన్ కూడా నవ్వుల్లో మునిగిపోయి తన చెల్లెలి భుజం మీద పడిపోయాడు.

సల్లూభాయ్‌ ముందరే గందరగోళం..

ఇక అంతటితో వికీ కౌశల్ మాట్లాడటం ఆపకుండా.. ఇది మాంచి పెళ్లిళ్ల సీజన్. మీరు కూడా పెళ్లి చేసుకోవాలని ఉవ్విల్యూరుతున్నట్టు కనిపిస్తున్నారు. అందుకే నేను పెళ్లి విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నాను అని అనగానే.. ఏంటీ అంటూ కత్రినా ఆశ్చర్య వ్యక్తం చేసింది. దాంతో బ్యాక్ గ్రౌండ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన ముజే షాదీ కరోగి చిత్రంలోని టైటిల్ సాంగ్ ప్లే చేయగానే సల్లూభాయ్‌తో సహా అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

కత్రినా కైఫ్, వికీ కౌశల్ కెరీర్

కత్రినా కైఫ్ విషయానికి వస్తే.. ఆమె నటించిన సూర్యవంశీ చిత్రం త్వరలోనే విడుదల కానున్నది. అలాగే ఫోన్ బూత్, టైగర్ 3 చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక వికీ కౌశల్ విషయానికి వస్తే.. మేజర్ సామ్ మానిక్ షా జీవితం ఆధారంగా రూపొందుతున్న సర్దార్ ఉద్దమ్ సింగ్ బయోపిక్‌తోపాటు ఇమ్మోర్టల్ అశ్వత్తామ చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here