కత్తి మహేష్ అంత్యక్రియలు వాయిదా.. ఎప్పుడు, ఎక్కడ, జరుగుతాయంటే?

0
9

సినీ విమర్శకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.. సుమారు 15 రోజుల పాటు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.. అయితే ఆయన అంత్యక్రియలు ఈరోజు స్వగ్రామంలో జరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగినా అవి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

రివ్యూలు ఇస్తూ

టాలీవుడ్ లో యాక్టివ్గా ఉంటూ పలు సినిమాలకు రివ్యూలు అందిస్తూ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి హీరోల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కత్తి మహేష్ పాపులర్ అయ్యాడు.. తొలుత సినిమాలకు రివ్యూలు రాయడం మొదలు పెట్టిన ఆయన ఆ తరువాతి కాలంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ బాలకృష్ణ లాంటి హీరోల మీద కామెంట్స్ చేస్తూ హైలైట్ అయ్యారు.

ప్రేమ-పెళ్లి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జర్నలిజం చేసిన ఆయన అక్కడే బెంగాల్కు చెందిన యువతితో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. అయితే ఒక కుమారుడు కూడా జన్మించాక అభిప్రాయ భేదాలు రావడంతో స్నేహపూర్వకంగానే విడిపోయారు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన సినిమాలకు సంబంధించిన అలాగే రాజకీయాలకు సంబంధించి మాత్రమే కాక కరెంట్ అఫైర్స్ కు సంబంధించి ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉండేవారు.

కారు యాక్సిడెంట్

కొన్ని రోజుల క్రితం విజయవాడ నుంచి సొంత ఊరు కారులో వెళ్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో కారు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను ముందు నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ కంటికి దెబ్బ తగలడంతో శస్త్రచికిత్స కూడా చేశారు.

అంతా బాగానే ఉందనుకున్న సమయంలో

అయితే మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి సుమారు 14 రోజుల నుంచి చికిత్స అందిస్తున్నారు. అంతా బాగానే ఉంది మరి కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకుని ఆయన ఇంకా లేచి రావటమే అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ఆయన కన్నుమూశారు.

అందుతున్న సమాచారం మేరకు ఆయన పార్థివ దేహం స్వగ్రామానికి చేరే అవకాశం కనిపిస్తోంది. ఆయన స్వగ్రామమైన చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలం ఎల్లమంద లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here