కంగన ట్విట్టర్ శాశ్వత బ్యాన్.. ఎగిరి గంతేసిన హృతిక్!

0
26

కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా ఇప్పుడు శాశ్వతంగా నిలిపేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తీర్పుకు వ్యతిరేకంగా కంగనా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తరువాత ఈ చర్య ఎదురైంది. తన ద్వేషపూరిత ప్రసంగం కారణంగా ట్విట్టర్ ఆగ్రహానికి గురై ఈ నష్టం తప్పలేదు.

కంగనా తన అభిప్రాయాలను వినిపించడానికి అనేక ఇతర ప్లాట్ ఫారమ్ లను కలిగి ఉండగా ట్విట్టర్ ఇలా చేయడం మరింత బలం పెంచినట్టయ్యింది. కంగనా వెంటనే ట్రెండింగ్ స్టార్ అయ్యింది. కానీ హృతిక్ రోషన్ పేరు కూడా అంతే వేగంగా ట్రెండ్ అయ్యింది. అక్కడ ట్విట్టర్ బ్లాక్ అవ్వగానే హృతిక్ గాల్లో తేలాడు. ఎగిరి గంతులేశాడు. అందుకు సంబంధించిన క్రిష్ వీడియో బోలెడంత ఫన్ పుట్టించింది. హృతిక్ నేరుగా వెళ్లి ట్విట్టర్ బాస్ ని కౌగిలించుకుని కన్నీరు పెట్టుకున్నట్టు గా కొన్ని మీమ్స్ ఈమోజీలు వ్వావ్ అనిపించాయి.

హృతిక్ రోషన్- కంగనా రనౌత్ లపై సరదాగా చేసిన ట్వీట్లు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. జోకులు మీమ్స్ అమాంతం వైరల్ అయ్యాయి. కంగనా రనౌత్ తో స్నేహపూర్వక సమీకరణం లేని సంజయ్ రౌత్ పై జోకులు కూడా క్రేజీగా వైరల్ అయ్యాయి. జనాలకు ఇదో రకం సరదా..ఆట!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here