ఒక్క మాట కూడా అనలేదు.. కానీ వేయాల్సిన సెటైర్ వేసేశాదు.. ప్రకాష్ రాజ్ మామూలోడు కాదు!!

0
34

దేశంలో కంగన రనౌత్, రియా చక్రవర్తి, సంజన గల్రానీ పేరు మార్మోగిపోతోంది. నేడు రకుల్ ప్రీత్ , సారా అలీఖాన్‌ల పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. డ్రగ్స్ కేసులో భాగంగా రియా రకుల్ ప్రీత్ , సారా పేర్లను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు కంగన రనౌత్ శివసేన ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వార్ గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కొందరు కంగనాకు మద్దతుగా నిలిస్తే.. ఇంకొందరు కంగనాను వేలెత్తి చూపిస్తున్నారు.

శివసేన వర్సెస్ కంగనా..

శివసేన, మహారాష్ట్ర ప్రభుత్వంతో కంగనా ఒంటరి పోరు చేస్తోంది. ముంబైలో అడుగుపెడితే చంపేస్తామన్న బెదిరింపులకు బయపడని కంగనా.. మొండిపట్టుతో ముంబైలో అడుగుపెట్టింది. ఈక్రమంలో కంగనా ఇంటిని, కార్యాలయన్ని అక్రమ నిర్మాణాల ఆరోపణలతో కూలగొట్టింది.

మండిపడ్డ కంగనా..

తన ఇళ్లు, కార్యాలయం అక్రమ నిర్మాణం అంటూ కూలగొట్టడంపై కంగనా ఫైర్ అయింది. ఈ రోజు మీరు నా ఇంటిని కూలగొట్టొచ్చు గానీ రేపు మీ అహంకారం కూలిపోతుంది అంటూ హెచ్చరించింది. ఇలా ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా నిలబడటంతో కొందరు సమర్థించారు. మరికొందరు వ్యతిరేకించారు.

కంగనాకు హ్యాట్సాఫ్..

నీ ధైర్యానికి, తెగింపుకు హ్యాట్సాఫ్ కంగనా. తప్పును తప్పును అని చెప్పడానికి ఒప్పును ఒప్పని చెప్పడానికి నువ్ ఎప్పుడూ ఆలోచించలేదు.. వెనకడుగు వేయలేదు. అది నీ వ్యక్తిగత విషయం కాకపోయినా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డావ్. ఎంతో ధైర్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నావ్ అని విశాల్ ప్రశంసించాడు.

విశాల్ మద్దతు..

కంగనా ధైర్యానికి ముచ్చటపడ్డ విశాల్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘నాడు 1920లో భగత్ సింగ్ చేసినట్టుగా నేడు నువ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ప్రశ్నించడానికి ప్రజలు ఎదురుతిరిగేందుకు నిన్ను ఉదాహరణగా తీసుకుని నిలిచే ఘట్టమవుతుంది. ఇలా ప్రభుత్వాలను ఎండగట్టేందుకు సెలెబ్రిటీలే కానక్కర్లేదు కామన్ మ్యాన్‌లా కూడా పోరాడొచ్చని చాటి చెబుతున్నావ్. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ (ఆర్టికల్ 19). కుదోస్ టు యూ.. నీ ముందు మోకరిల్లుతాను’ అంటూ ట్వీట్ చేశాడు.

ఒక్క మాట కూడా..

సోషల్ మీడియాలో #justasking పేరుతో ప్రకాష్ రాజ్ సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అంత సులవైన పనేమీ కాదు. తాజాగా ప్రకాష్ రాజ్ కంగనాపై సెటైర్ వేశాడు. ఒక్క సినిమాతో కంగనా.. తనను తాను రాణి లక్ష్మీ బాయి అని అనుకుంటే.. అప్పుడు దీపికా పడుకొనే -పద్మావతి, హృతిక్ రోషన్- అక్బర్, షారుఖ్‌ ఖాన్-అశోక, అజయ్ దేవ్‌గన్- భగత్ సింగ్, అమీర్ ఖాన్-మంగల్ పాండే, వివేక్ ఒబేరాయ్- మోదీ.. వీళ్లు కూడా అలా అయిపోతారా? అంటూ వచ్చిన ఓ మీమ్‌ను ప్రకాష్ రాజ్ షేర్ చేశాడు. తన అభిప్రాయాన్ని ఇలా చెప్పకనే చెప్పేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here